Samavarthi | సత్యదేవ్ కొత్త సినిమా.. ‘సమవర్తి’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
Satya Dev New Movie | టాలీవుడ్ నటుడు సత్యదేవ్ సరికొత్త యాక్షన్ మోడ్‌లోకి మారిపోయాడు. ఆయన హీరోగా నటిస్తున్న 16వ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ తాజాగా వచ్చింది.
Satya Dev New Movie | టాలీవుడ్ నటుడు సత్యదేవ్ సరికొత్త యాక్షన్ మోడ్‌లోకి మారిపోయాడు. ఆయన హీరోగా నటిస్తున్న 16వ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ తాజాగా వచ్చింది. ఈ చిత్రానికి ‘సమవర్తి’ (Samavarthi) అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఆరంభం’ ఫేమ్ అజయ్ నాగ్ వి. దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. ఈ చిత్రాన్ని ఒక పవర్ఫుల్ ఎకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ (Ecological Action Thriller) గా రూపొందిస్తున్నారు మేకర్స్. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో సత్యదేవ్ చేతిలో గొడ్డలి పట్టుకుని, మునుపెన్నడూ చూడని రీతిలో ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. ఒక వైల్డ్ రైడ్‌లా సాగే ఈ కథలో సత్యదేవ్ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉండబోతోందని చిత్రబృందం పేర్కొంది.
రుద్ర పిక్చర్స్ మరియు పంచభూత అఫీషియల్ బ్యానర్లపై జక్కిడి శివ, శశిధర్ సంయుక్తంగా ఈ హై-బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వైల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌లో దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, రవీంద్ర విజయ్ తదతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
#SD16 is #Samavarthi – ONE HELL OF A WILD RIDE 🔥
Presenting @ActorSatyaDev, in ADRENALINE ACTION MODE❤️🔥🪓
An Ecological Action Thriller !
Written & Directed by @AjayNagV 🎬
Produced by @JakkidiShivaIYC @Shashidhar1909@Rudra_Pictures @PanchabhutaOffl
HUNTING SOON, IN… pic.twitter.com/znpGggiz0K
— Vamsi Kaka (@vamsikaka) May 22, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

