e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home News బొగ్గు కుంభకోణం కేసుల విచారణకు న్యాయమూర్తులను నియమించిన సుప్రీంకోర్టు

బొగ్గు కుంభకోణం కేసుల విచారణకు న్యాయమూర్తులను నియమించిన సుప్రీంకోర్టు

బొగ్గు కుంభకోణం కేసుల విచారణకు న్యాయమూర్తులను నియమించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : గత ఆరేండ్లుగా బొగ్గు కుంభకోణం కేసుల విచారణ కొనసాగుతున్నది. ఇప్పటివరకు అదనపు సెషన్స్ జడ్జి (స్పెషల్ జడ్జి) భారత్ పరాషర్ కోర్టులో విచారించారు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు కాంప్లెక్స్‌లోని న్యాయస్థానం మాజీ బొగ్గు కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, ఎన్‌డీఏ హయాంలో బొగ్గు మంత్రిగా ఉన్న దిలీప్ రే, యూపీఏ హయాంలోని మాజీ మైనింగ్ మంత్రి మధు కోడాతో పాటు పలువురు బడాబాబులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దోషిగా తేల్చింది. అయితే, ఇంతవరకు ఎటువంటి ఆరోపణలు నిరూపితం కాలేదు.

అయితే, న్యాయమూర్తి పరాషర్ పదోన్నతి ఆలస్యం కావడంతో పెండింగ్‌లో ఉన్న కేసులను విచారించేందుకు సుప్రీంకోర్టు మరో ఇద్దరు న్యాయమూర్తులను నియమించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బోబ్డె నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం అదనపు సెషన్స్‌ న్యాయమూర్తులు అరుణ్ భరద్వాజ్, సంజయ్ బన్సాల్‌లను న్యాయమూర్తి పరాషర్ స్థానంలో నియమించింది.

బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో 41 కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని స్పెషల్ ప్రాసిక్యూటర్ ఆర్‌ఎస్ చీమా ఎత్తిచూపిన తరువాత ఇద్దరు న్యాయమూర్తుల నియామకం జరిగింది.

న్యాయమూర్తి పరాషర్ స్థానంలో ఇద్దరు న్యాయమూర్తులను నియమించేందుకు పేర్లను సిఫారసు చేయాలని సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రార్ జనరల్ ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేసారు. వీరిలో నుంచి అరుణ్‌ భరద్వాజ్, సంజయ్‌ బన్సాల్‌లను నియమించేందుకు సుప్రీంకోర్టు ఎంపిక చేసింది.

బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు 1993-2010 మధ్య అన్ని కేటాయింపులను కవర్ చేస్తున్నది. బొగ్గు మైనింగ్ కంపెనీలకు బొగ్గు గనుల కేటాయింపులను తప్పుగా నిర్వహించడం ద్వారా ఎన్‌డీఏ, యూపీఏ ప్రభుత్వాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతకుముందు తన వాదనల్లో డాక్యుమెంటేషన్, కేసుల పరిమాణం కారణంగా విచారణలను వేగవంతం చేయడానికి ఎక్కువ మంది న్యాయమూర్తుల నియామకం అవసరమని స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌ చీమా సూచించారు.

సుప్రీంకోర్టు స్పెషల్ ప్రాసిక్యూటర్‌గా నియమితులైన చీమా స్థానంలో కొత్త ప్రాసిక్యూటర్ కోసం పేర్లను సిఫారసు చేయాలని సొలిసిటర్ జనరల్‌ను సుప్రీంకోర్టు సూచించింది.

ఇవి కూడా చదవండి..

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళను అమ్మేసిన దుర్మార్గుడు

వర్చువల్‌గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్‌ జంట

ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న దావానలం

అణగారిన వర్గాల గొంతుక బాబుజీ.. చరిత్రలో ఈరోజు

అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన

ఫాల్కే అవార్డును దోస్త్‌ రాజ్‌ బహదూర్‌కు అంకితం చేస్తున్నా: రజినీకాంత్

ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
బొగ్గు కుంభకోణం కేసుల విచారణకు న్యాయమూర్తులను నియమించిన సుప్రీంకోర్టు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement