Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Jayannth & The Jingo Pen | నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’.
Jayannth & The Jingo Pen | నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పిల్లల కోసం ప్రత్యేకంగా సినిమా టికెట్ ధరను రూ. 250 నుంచి రూ. 150కి తగ్గిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ చిత్రానికి సంగీతం అందించి, పాటలు రాసిన ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తాను రాసిన పాటలకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. బాలల దినోత్సవం కానుకగా నవంబర్ 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను చూసేందుకు పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ భారీ సంఖ్యలో థియేటర్లను బుక్ చేసుకుంటున్నారని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.
మాస్టర్ జయంత్ బొలిశెట్టి మాట్లాడుతూ.. చిల్డ్రెన్స్ డే స్పెషల్‌గా వస్తున్న ఈ సినిమా టికెట్ ధరను పిల్లల కోసం రూ. 250 నుంచి రూ. 150కి తగ్గించామని తెలిపారు. పిల్లలు, పెద్దలు మరియు ఉపాధ్యాయులకు ఒక చక్కటి సందేశాన్ని అందించే ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పారు.
నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని భావోద్వేగాలు అందరినీ ఆకట్టుకుంటాయని తెలిపారు. పిల్లల మార్కులను మాత్రమే కాకుండా వారి మనసులను చూడాలనే సందేశంతో ఈ సినిమాను తెరకెక్కించామని, పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ తప్పకుండా ఈ మూవీని చూడాలని కోరారు.
సహ నిర్మాత షఫి మాట్లాడుతూ.. పిల్లలకు ప్రత్యేక కానుకగా ఈ సినిమాను బాలల దినోత్సవం రోజున విడుదల చేస్తున్నామని, అందుకే రూ. 250 ఉన్న టికెట్ ధరను రూ. 150కే అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో హౌస్ ఫుల్ బుకింగ్స్ అవుతున్నాయని, అందరూ నవంబర్ 14న థియేటర్లలో ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరారు.
దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని కేవలం వ్యాపార దృక్పథంతో తీయలేదని, అందుకే పిల్లల కోసం టికెట్ ధరలను రూ. 150కి తగ్గించామని వెల్లడించారు. ఇప్పటికే చాలా పాఠశాలలు ప్రత్యేక ప్రదర్శనల కోసం థియేటర్లను బుక్ చేసుకున్నాయని చెప్పారు. నవంబర్ 14న వస్తున్న తమ ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

