జైలు నుంచి లేఖ రాయడం కొత్త వ్యూహమే : సంజయ్ రౌత్
మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరాబ్‌కు మద్దతుగా శివసేన నాయకుడు సంజయ్ రౌత్ నిలిచారు. జైలు నుంచి సచిన్ వాజే చేసిన ఆరోపణలను రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు.

ముంబై : మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరాబ్‌కు మద్దతుగా శివసేన నాయకుడు సంజయ్ రౌత్ నిలిచారు. జైలు నుంచి సచిన్ వాజే చేసిన ఆరోపణలను రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు.
‘జైలులో ఉన్న వారు లేఖలు వ్రాసే కొత్త వ్యూహం వెలుగులోకి వచ్చింది. ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రే. నాకు అనిల్ పరాబ్ తెలుసు. అతను ఎప్పుడూ అలాంటి పనుల్లో పాల్గొనలేదు. నేను భరోసా ఇవ్వగలను. బాలా సాహెబ్ ఠాక్రే పేరు మీద ఏ శివసైనిక్ తప్పుడు ప్రమాణం చేయలేరు’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
తన కేసును విచారిస్తున్న సీబీఐ అధికారుల బృందానికి సచిన్ వాజ్ నాలుగు పేజీల లేఖ రాశారు. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ప్రస్తుత రవాణా మంత్రి అనిల్ పరాబ్.. వ్యాపారవేత్తలు, సంస్థల నుంచి డబ్బు వసూలు చేయాలని తనకు చెప్పినట్లు ఆరోపించారు. ముంబైలోని బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని సచిన్ వాజ్‌ను ఆదేశించినట్లు అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ ఆరోపణలు చేశారు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారిస్తున్నది. సచిన్ వాజ్ తన లేఖలో ఆరోపించిన అనిల్పరాబ్కు శివసేన నేత సంజయ్ రౌత్ అండగా నిలిచారు. అయన అలాంటి వ్యక్తి కాదని, అలాంటి పనులు చేయరని రౌత్ చెప్పుకొచ్చారు.
తనపై ఆరోపణలు బీజేపీ ఎజెండా: అనిల్ పరాబ్

తనపై సచిన్ వాజ్ ఆరోపణలు చేస్తూ రాసిన అంశాలను రవాణా శాఖ మంత్రి అనిల్ పరాబ్ తోసిపుచ్చారు. మహారాష్ట్ర వికాస్ అగాడి (ఎంవీఏ) ప్రభుత్వం పరువు తీసేందుకు భారతీయ జనతా పార్టీ కుట్రగా పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను కించపరచడానికి, ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్న వారిని దుర్భాషలాడటం అవసరం. ఇది బీజేపీ అనుసరిస్తున్న ఎజెండాలో ఒక భాగం’ అని ఆయన గురువారం మీడియాతో అన్నారు. ఏ ఏజెన్సీ అయినా.. అది ఎన్ఐఏ, రా లేదా మరేదైనా కావచ్చు.. తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ కేసుపై చట్టబద్ధంగా పోరాడతానని చెప్పారు.
గత రెండు రోజులుగా అనిల్ పరాబ్ పేరు బయటపడుతుందని బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారని, సచిన్ వాజ్ లేఖ రాస్తారని వారికి ఎలా తెలుసు? అని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర మంత్రుల పరువు తీసే ప్రణాళికగా ఉన్నదని స్పష్టమవుతోందన్నారు. ఒకవేళ తాను దోషిగా తేలితే ఉద్దవ్ ఠాక్రే తనను ఉరితీస్తారని అనిల్ పరాబ్ చెప్పారు.
కాగా, ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్, మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అందుబాటులో లేరు.
ఇవి కూడా చదవండి..
కరోనా సెకండ్ వేవ్ : కొత్తగా మూడు లక్షణాలు.. తేలికగా తీసుకోవద్దు..
బ్రిటిష్ అసెంబ్లీలో బాంబులు వేసిన భగత్‌సింగ్, బటుకేశ్వర్.. చరిత్రలో ఈరోజు
కొవిడ్‌కు గురైనవారిలో నాడీ, మానసిక రుగ్మతలు
ఏసీలు, ఎల్ఈడీ లైట్ల కోసం పీఎల్ఐ పథకం
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
సరిహద్దులో చొరబాటుదారు హతం.. భారీగా మందుగుండు స్వాధీనం
పరంబీర్సింగ్తో వాజ్ సన్నిహితంగా ఉండేవారు : కమిషనర్ నివేదిక
జవాన్ రాజేశ్వర్ విడుదలకు చర్చలు షురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court: 3 రాష్ట్రాల మధ్య 60 ఏళ్లుగా విద్యుత్తు వివాదం.. పరిష్కరించిన సుప్రీంకోర్టు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

