GT vs RR : టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్‌కు క్వాలిఫయర్ 2లో ఆదిలోనే షాక్ తగిలింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ యశస్వీ జైస్వాల్(1) సిక్సర్ కొట్టబోయి నాలుగో బంతికే ఔటయ్యాడు. గాల్లోకి లేపిన బంతిని ప్రసిధ్ ఒడుపుగా అందుకోగా తొలి వికెట్ పడింది. తర్వాతి ఓవర్లో జురెల్(7)ను ఔట్ చేసిన రబడ(1-21) రెండో వికెట్ అందించాడు. అనంతరం బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి వైభవ్ సూర్యవంశీ(౦) గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దాంతో.. పవర్ ప్లేలో రాజస్థాన్ 2 వికెట్ల నష్టానికి 70 కొట్టింది.
తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడినా వైభవ్ సూర్యవంశీ(31 నాటౌట్) ఒత్తిడికి లోనవ్వలే. యశస్వీని ఔట్ చేసి గుజరాత్‌కు తొలి బ్రేకిచ్చిన సిరాజ్ ఓవర్లో మూడు ఫోర్లతో తన స్టయిల్లో సమాధానమిచ్చాడీ చిచ్చరపిడుగు. ఆపై రబడ ఓవర్లో స్ట్రెయిట్ సిక్సర్‌తో స్కోర్ నలభై దాటించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన రవీంద్ర జడేజా(26 నాటౌట్).. 6వ ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదగా స్కోర్ 70కి చేరింది.
THE VAIBHAV SOORYAVANSHI SHOW 🤩🩷
🎥 The Boy Wonder playing fire with fire 🔥
Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR | @rajasthanroyals pic.twitter.com/UFvfez3ORP
— IndianPremierLeague (@IPL) May 29, 2026