గిన్నిస్ రికార్డు గోర్లు.. 30 ఏండ్ల తర్వాత కత్తిరింపు
చేతి వేళ్లకు అతిపొడవైన గోర్లు పెంచి గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ఓ అమ్మడు.. సరిగ్గా 30 ఏండ్ల తర్వాత ఆ గోర్లను కత్తిరించుకున్నది

టెక్సాస్ : చేతి వేళ్లకు అతిపొడవైన గోర్లు పెంచి గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్న ఓ అమ్మడు.. సరిగ్గా 30 ఏండ్ల తర్వాత ఆ గోర్లను కత్తిరించుకున్నది. గత కొన్నాళ్లుగా తన పొడవాటి గోర్లతో ఇబ్బందులు పడుతుండటంతో వాటిని కత్తిరించుకోవాలని నిర్ణయించుకుని.. ఆ మేరకు వైద్యుల సమక్షంలో గోర్లను తొలగించుకున్నది.
పొడవైన వేలి గోర్లకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను కైవసం చేసుకున్న టెక్సాన్ మహిళ అయన్నా విలియమ్స్.. చివరకు 30 సంవత్సరాల తర్వాత తన గోళ్లను కత్తిరించుకున్నది. విలియమ్స్ చేతి గోర్లు 2017 లో కొలిచినప్పుడు దాదాపు 19 అడుగుల పొడవు ఉన్నాయి. చాలా పొడవైన వేలి గోర్లకు గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టారు. ఆమె తన రెండు చేతుల గోర్లకు నెయిల్‌పాలిష్ చేసుకోవడానికి రెండు సీసాల నెయిల్ పాలిష్ అవసరమయ్యేది. అలాగే నెయిల్ పాలిష్ చేసుకోవడానికి దాదాపు 20 గంటల సమయం పట్టేది.
గత కొన్నిరోజులుగా తన పొడవాటి గోర్లతో ఇబ్బందులు రావడంతో 30 ఏండ్లనాటి గోర్లను తొలగించుకోవాలని విలియమ్స్ నిర్ణయించుఉన్నది. టెక్సాస్‌లోని ఫోర్ట్‌వర్త్ చర్మవ్యాధి దవాఖానలతో సంప్రదించి వారి సమక్షంలో తన గోర్లను కత్తిరించుకున్నది. ఆ సమయంలో వాటిని కొలవగా.. 24 అడుగుల 0.7 అంగుళాలుగా తేలాయి.
అయన్నా తన పొడవాటి గోర్లతో రోజువారీ ఇబ్బందులను ఎదుర్కొన్నది. వంట చేయడం, వంటపాత్రలు కడగటం, మంచంపై దుప్పట్లు పరవడం వంటి కొన్ని కార్యకలాపాలను చేయలేకపోయింది. ఇప్పుడు గోర్లను కత్తిరించుకోవడంతో అలాంటి పనులన్నింటినీ చిటికెలో చేసేస్తానంటోంది ఆమె. ఇప్పుడు నా గోర్లను అందంగా ముస్తాబు చేసుకుని ప్రత్యేకతను చాటుకుంటానని చెప్తుందా అమ్మడు.
ఇవి కూడా చదవండి..
కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..
భారత్‌లోని 3 నగరాల్లో షోరూంలు తెరుస్తున్న టెస్లా
ట్రైనీ ఎయిర్‌హోస్టెస్‌కు ఇంటర్ విద్యార్థి వేధిపులు.. ఐదు గంటల్లోనే పట్టివేత
వీడియో వైరల్: పనివాడితో గున్న ఏనుగు సరదా పోట్లాట..! గెలుపెవరిదంటే..?
భారత్‌పై సైబర్ దాడులు చేసే సామర్థ్యం చైనాకుంది: సీడీఎస్ బిపిన్ రావత్
రేపు భారత్, చైనా మధ్య 11 వ రౌండ్ చర్చలు
జైలు నుంచి లేఖ రాయడం కొత్త వ్యూహమే : సంజయ్ రౌత్
కరోనా సెకండ్ వేవ్ : కొత్తగా మూడు లక్షణాలు.. తేలికగా తీసుకోవద్దు..
బ్రిటిష్ అసెంబ్లీలో బాంబులు వేసిన భగత్‌సింగ్, బటుకేశ్వర్.. చరిత్రలో ఈరోజు
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

