e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home News బ‌డుగుల ఆశాజ్యోతి .. జ్యోతీరావ్ పూలే.. చరిత్ర‌లో ఈ రోజు

బ‌డుగుల ఆశాజ్యోతి .. జ్యోతీరావ్ పూలే.. చరిత్ర‌లో ఈ రోజు

బ‌డుగుల ఆశాజ్యోతి .. జ్యోతీరావ్ పూలే.. చరిత్ర‌లో ఈ రోజు

అణచివేతకు గురైన బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు మ‌హాత్మా జ్యోతిరావ్ ఫూలే. పూలే విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానత్వం నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారు. కుల, మత రహిత సమాజ నిర్మాణానికి ఎనలేని కృషి చేశారు. సమాజం విద్యా పరంగా ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి అవుతుందని ఆశించారు.

సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫూలే.. మహారాష్ట్ర సతారా జిల్లాలోని వ్యవసాయ తోట మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించారు. జ్యోతీరావ్ తండ్రి పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలే గా మార్పు చెందిందని చ‌రిత్ర‌కారులు చెప్తుంటారు.

- Advertisement -

అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజూ నిద్రకుపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునే వాడు. జోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజీ, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ ల‌క్ష‌ణాలు అలవాటయ్యాయి. థామస్‌ రచించిన ‘మానవ హక్కులు’ పుస్తకం అతడి ఆలోచనలను ప్రభావితం చేసింది.

1848 లో కుల‌వివ‌క్ష‌కు గురైన జ్యోతీరావ్ ఫూలే.. ఆనాటి నుంచి కుల వివ‌క్ష‌కు వ్య‌తిరేకంగా పోరాటం ప్రారంభించారు. పూలే ప్రజల్లో వితంతు పునర్వివాహం గురించి చైతన్యం తీసుకొచ్చారు. 1864 గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించ‌డం ద్వారా వితంతువులైన గర్భిణీల‌కు అండగా నిలిచారు. బాల్య‌వివాహాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చారు. మ‌హిళ‌ల చ‌దువు కోసం పాటుప‌డ్డారు.

పూలే స్థాపించిన సత్యశోధక సమాజం.. భగవంతుడు, భక్తుడికి మధ్య దళారీలుగా పురోహితులు ఉండవద్దని పిలుపునిచ్చింది. ఆ కాలంలోనే మునిసిపల్‌ కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజాప్రతినిధిగా కూడాసేవలందించారు. దీనబంధు అనే పత్రికను స్థాపించి బీదల, కార్మికుల సమస్యలను సమాజానికి తెలిసేలా చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్‌ అంబేద్కర్..‌ జ్యోతిబా పూలే తన గురువుగా ప్రకటించుకున్నారంటే ఆయన గొప్పదనం ఏంటో అర్థమవుతుంది.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2000: తన తొలి రచన ‘ఇంటర్‌ప్రెటర్ ఆఫ్ మెల్లడీస్’ కు పులిట్జర్ బహుమతి అందుకున్న‌భారతీయ-అమెరికన్ రచయిత ఝంపా లాహిరి

1997 : 10 నెల‌ల త‌ర్వాత కుప్ప‌కూలిన‌ హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్ర‌భుత్వం

1983 : మ‌హాత్ముడి జీవిత చ‌రిత్ర ఆధారంగా నిర్మించిన సినిమా గాంధీకి ఆస్కార్ ప్ర‌క‌ట‌న‌

1984: సింగర్ శిల్పా రావు జననం

1977: హిందీ సాహితీవేత్త‌, పద్మశ్రీ ఫనిశ్వర్ నాథ్ ‘రేణుస‌ మరణం

1976: స్టీవ్ వాజ్నెక్ రూపొందించి, నిర్మించిన మొట్టమొదటి ఆపిల్ కంప్యూటర్ విడుదల

1964 : రెండుగా విడిపోయిన క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ‌

1961: ఇజ్రాయెల్‌లో నాజీ యుద్ధ నేరాలకు అడాల్ఫ్ ఐచ్‌మన్‌పై విచారణ ప్రారంభం

1937: భారత టెన్నిస్ క్రీడాకారుడు రామనాథన్ కృష్ణన్ జనన‌నం

1921: ఆటల తొలి ప్రత్యక్ష వ్యాఖ్యానం రేడియోలో ప్రసారం

1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ స్థాప‌న‌

1869: మహాత్మా గాంధీ స‌తీమ‌ణి కస్తూర్బా గాంధీ పోర్బందర్లో జననం

1814: అధికారం నుంచి బహిష్కర‌ణ‌కు గురైన నెపోలియన్

ఇవి కూడా చదవండి..

రైతులతో మరిన్ని చర్చల‌కు ప్రభుత్వం సిద్ధం : న‌రేంద్ర‌ తోమర్

డైనోసార్ల క‌లిసి తిరిగిన ఉడుమును క‌నుగొన్న శాస్త్ర‌వేత్త‌లు

కొవిడ్‌తో న‌టుడు సతీష్ కౌల్ క‌న్నుమూత

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బ‌య‌ల్దేరిన ముగ్గురు వ్యోమ‌గాములు

కొవిడ్ వ్యాక్సిన్‌కు బదులుగా యాంటీ రాబిస్ డోసులిచ్చారు..

గిన్నిస్‌ రికార్డు గోర్లు.. 30 ఏండ్ల తర్వాత కత్తిరింపు

కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..

భారత్‌లోని 3 నగరాల్లో షోరూంలు తెరుస్తున్న టెస్లా

వావ్‌..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!

ఆరోగ్యంగా ఉంటేనే ధనవంతులం..

మనపై రంగుల ప్రభావం ఉంటుందా..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బ‌డుగుల ఆశాజ్యోతి .. జ్యోతీరావ్ పూలే.. చరిత్ర‌లో ఈ రోజు
బ‌డుగుల ఆశాజ్యోతి .. జ్యోతీరావ్ పూలే.. చరిత్ర‌లో ఈ రోజు
బ‌డుగుల ఆశాజ్యోతి .. జ్యోతీరావ్ పూలే.. చరిత్ర‌లో ఈ రోజు

ట్రెండింగ్‌

Advertisement