కొవిడ్‌తో నటుడు సతీష్ కౌల్ కన్నుమూత
ప్రముఖ నటుడు సతీష్ కౌల్ కరోనా వైరస్‌కు గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు

లుథియానా : ప్రముఖ నటుడు సతీష్ కౌల్ కరోనా వైరస్‌కు గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. గత వారం రోజులుగా ఆయన కొవిడ్‌కు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.
బీఆర్ చోప్రా నిర్మించిన మహాభారతంతో పాటు పలు హిందీ చిత్రాలు నటించారు. పలు ప్రదర్శనల్లో పాల్గొన్నారు. లాక్డౌన్ మధ్య ప్రాథమిక అవసరాలతో పోరాడుతున్న ఈ నటుడు.. గత ఏడాది మే నెలలో చిత్ర పరిశ్రమ నుంచి ఆర్థిక సహాయం కోరారు.
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) 1969 బ్యాచ్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన సతీష్ కౌల్.. 1954 సెప్టెంబర్ 8 న కాశ్మీర్లో జన్మించారు. బాలీవుడ్ నటులు జయ బచ్చన్, షత్రుఘ్న సిన్హా, జరీనా వహాబ్, డానీ డెంజోంగ్పా, ఆశా సచ్‌దేవా, ఓం పూరి వంటి వారు ఎఫ్టీఐఐలో అతని బ్యాచ్ మేట్స్.
సతీష్ కౌల్ ప్రధానంగా పంజాబీ సినిమాల్లో నటించారు. అతను 300 కి పైగా చిత్రాలలో పనిచేశారు. అందులో 85 చలన చిత్రాలలో ప్రధాన పాత్ర పోషించారు. కర్మ, ప్రేమ్ పర్బాట్, వారెంట్, గునాహో కా ఫైస్లా, భక్తి మీ శక్తి, డాన్స్ డాన్స్, రామ్ లఖన్, ప్యార్ తో హోనా హి థా వంటి కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా ఆయన నటించారు.
66 ఏండ్ల ఈ నటుడు మహాభారతం, విక్రమ్ ఔర్ బేతాల్ అనే టెలివిజన్ షోలలో నటించి మెప్పించారు. బీఆర్ చోప్రా నిర్మించిన మహాభారతం సీరియల్లో ఇంద్ర పాత్ర పోషించారు. సతీష్ కౌల్ ముంబై నుంచి పంజాబ్‌కు వెళ్లి 2011 లో యాక్టింగ్ స్కూల్‌ను ప్రారంభించాడు. అయితే, అది విజయవంతం కాలేదు.
సతీష్ కౌల్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 2019 లో రూ.5 లక్షల సహాయం చేశారు. “పంజాబీ నటుడు సతీష్ కౌల్ జి మంచి ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటున్నాను. లుథియానా డీసీ ద్వారా అతని వైద్య చికిత్స కోసం రూ.5 లక్షలు విడుదల చేశాం. మన రాష్ట్రానికి సహకరించిన వారందరికీ సహాయం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఇది మా సంస్కృతి” అని కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరిన ముగ్గురు వ్యోమగాములు
కొవిడ్ వ్యాక్సిన్‌కు బదులుగా యాంటీ రాబిస్ డోసులిచ్చారు..
గిన్నిస్ రికార్డు గోర్లు.. 30 ఏండ్ల తర్వాత కత్తిరింపు
కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..
భారత్‌లోని 3 నగరాల్లో షోరూంలు తెరుస్తున్న టెస్లా
వావ్..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- CInema
- Coronavirus
- Ludhiana
- Punjab
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

