e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News తొలిసారిగా అంత‌రిక్షంలో కాలిడిన యూరి గ‌గారిన్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

తొలిసారిగా అంత‌రిక్షంలో కాలిడిన యూరి గ‌గారిన్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

తొలిసారిగా అంత‌రిక్షంలో కాలిడిన యూరి గ‌గారిన్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

1967 సంవత్సరం.. ఏప్రిల్ 12 రోజు.. మాస్కోలో ఉదయం 9:37 గంట‌లు. సోవియట్ యూనియన్ మొత్తం ఊపిరి బిగ‌బ‌ట్టి ఆకాశం వైపు చూస్తూ ఉన్న‌ది. వోస్టాక్ -1 విమానం లాంచ్ అయిన వెంటనే అందరూ సంతోషంగా ఉన్నారు. మొదటిసారి ఒక వ్యక్తి అంతరిక్షంలోకి అడుగుపెట్టాడు. దీనితో పాటు యూరి గగారిన్ పేరు కూడా చరిత్రలో నమోదైంది. యూరి 108 నిమిషాల తరువాత భూమికి తిరిగి వచ్చాడు. ప్రపంచం అంతా అతన్ని హీరోలా స్వాగతించింది.

1934 లో రష్యాలోని క్లూషినో గ్రామంలో జన్మించిన యూరి అలెక్సెవిచ్ గగారిన్.. ఒక‌ వడ్రంగి కుమారుడు. యూరికి ఆరేండ్ల‌ వయస్సు ఉన్నప్పుడు, అతని ఇంటిని రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ అధికారి ఆక్రమించారు. అతని కుటుంబం మొత్తం రెండేండ్లపాటు గుడిసెలో నివసించాల్సి వచ్చింది. నాజీలు తమ ఇద్ద‌రు సోదరీమణులను బంధించి కార్మికులుగా జర్మనీకి పంపారు.

యూరి త‌న 16 సంవత్సరాల వయసులో మాస్కోకు వెళ్ళారు. అక్కడ సరతోవ్‌లోని టెక్నికల్ స్కూల్‌లో చదివే అవకాశం వచ్చింది. అక్కడ టెక్నిక‌ల్ పాఠశాలలో చేరారు. ఇక్కడి నుండే విమానంలో కూర్చుని ఆకాశాన్ని తాకాలనే కలలు క‌న‌డం ప్రారంభమైంది. 1955 లో అతను మొదటిసారి సోలో విమానం ప్రయాణించారు. 1957 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత యూరి ఫైటర్ పైలట్ అయ్యారు.

1957 లోనే సోవియట్ యూనియన్ మొదటి ఉపగ్రహమైన స్పుత్నిక్ -1 ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. దీని తరువాత మనిషిని అంతరిక్షంలోకి పంపాలని నిర్ణయించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించారు. వేలాది మంది కఠినమైన మానసిక, శారీరక పరీక్షలు చేయించుకున్నారు. చివరికి 19 మందిని ఎంపిక చేయ‌గా.. వారిలో యూరి గగారిన్ ఒకరుగా నిలిచారు.

అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన తరువాత, గగారిన్ ఇతర వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. 1968 మార్చి 27 న అలాంటి ఒక శిక్షణా సమయంలో అతడి మిగ్ -15 ఓడ కూలిపోవ‌డంతో యూరి గగారిన్, తోటి పైలట్ అక్కడికక్కడే మరణించారు. 1968 లో అతడి గౌరవార్థం అతని స్వస్థలమైన పట్టణానికి ‘గగారిన్’ అని పేరు పెట్టారు.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు :

2014: ప్రముఖ గీత రచయిత గుల్జార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్ర‌క‌ట‌న‌

2013: స్వలింగ వివాహం గుర్తించిన ఫ్రాన్స్‌

2010: భారత కబడ్డీ జట్టు పాకిస్తాన్ జట్టును 58-24తో ఓడించి మొదటి కబడ్డీ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

1998: నేపాల్ ప్రధానిగా నియ‌మితులైన గిరిజా ప్రసాద్ కొయిరాలా

1981: అమెరికా కాంగ్రెస్‌లో మొదటి హిందూ అమెరికన్ ఎంపీ తులసి గబ్బర్డ్ జననం

1954 : ప్ర‌ముఖ నాట‌క క‌ళాకారుడు స‌ఫ్ద‌ర్ హ‌ష్మీ జ‌న‌నం

1945 : అమెరికా మాజీ అధ్య‌క్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ మ‌ర‌ణం

1943: లోక్‌స‌భ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ జననం

1917: భారత క్రికెట‌ర్‌ వీను మ‌న్క‌డ్ జననం

1885: మొహెంజోడారోను కనుగొన్న ప్రసిద్ధ చరిత్రకారుడు రాఖల్దాస్ బెనర్జీ జననం

1621: సిక్కు గురు తేజ్‌ బహదూర్ జననం

ఇవి కూడా చదవండి..

మూడు రాష్ట్రాల్లో కొవిడ్ చ‌ర్య‌ల్లో లోపాలు : గుర్తించిన కేంద్ర బృందాలు

స్మ‌గ్ల‌ర్ల కాల్పుల్లో ఇద్ద‌రు పోలీసులు మృతి

ఎంసీడీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు షాక్

ధైర్యం, థ్రిల్, పోటీ స్ఫూర్తి ఉన్న పురుషులే మంచి తండ్రులు

అమెరికాలో కరోనా మ‌హ‌మ్మారి నాలుగో వేవ్..?!

అక్రమ ఆయుధ మార్కెట్: గ‌న్ కావాలా పెషావ‌ర్ రండి..!

వివాదాల్లో జో బైడెన్ కుమారుడు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తొలిసారిగా అంత‌రిక్షంలో కాలిడిన యూరి గ‌గారిన్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

ట్రెండింగ్‌

Advertisement