Dowry demonism | కట్నం చావులు ఎక్కువే..52.8%తో దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ
రాష్ట్రంలో వరకట్న రాక్షసత్వం ఆగ డం లేదు. కట్నం కోసం పిశాచాల్లా ఆడబిడ్డలను పీక్కుతింటున్నారు. వరకట్న మరణాలపై అవగాహన కల్పించాల్సిన ప్రభు త్వం మిన్నకుండిపోవడంతో ఆడబిడ్డల ఆర్తనాదాలు నాలుగుగోడలు దాటి బయటికి రావడం లేదు.
- 52.8%తో దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ
- 2024లో రాష్ట్రంలో పది వేలకు పైగా కేసుల నమోదు
- ఆడబిడ్డలపై ఆగని అఘాయిత్యాలు
- వెల్లడించిన ఎన్సీఆర్బీ నివేదిక
- కట్నం కోసం కడతేర్చడంలో ఫస్ట్
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వరకట్న రాక్షసత్వం ఆగ డం లేదు. కట్నం కోసం పిశాచాల్లా ఆడబిడ్డలను పీక్కుతింటున్నారు. వరకట్న మరణాలపై అవగాహన కల్పించాల్సిన ప్రభు త్వం మిన్నకుండిపోవడంతో ఆడబిడ్డల ఆర్తనాదాలు నాలుగుగోడలు దాటి బయటికి రావడం లేదు. తాజాగా వెల్లడైన 2024 ఎన్సీఆర్బీ క్రైమ్ నివేదిక రాష్ట్రంలో వరకట్న వేధింపులు, మరణాల భయానక రూపాని కి అద్దం పడుతున్నది. భర్త, అత్తమామల వేధింపుల్లో తెలంగాణ 6వ స్థానంలో ఉన్నట్టు ఎన్సీఆర్బీ నివేదిక చెబుతున్నది. అదనపు కట్నం తేవాలంటూ భర్త, అతని తర ఫు బంధువులు మహిళలను శారీరకంగా, మానసికంగా ఎంతలా వేధిస్తున్నారో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో 2024లో మొత్తం 10,061 కేసులు నమోదయ్యాయి. ఈ విభాగంలో మహిళలపై జరిగే నేరాల రేటులో రాష్ట్రం 52.8 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దేశ సగటు రేటు 17.3% ఉంటే, తెలంగాణలో అది మూడు రెట్లకు పైగా ఉండటం సమస్య తీవ్రతను సూచిస్తున్నది.
కట్నం కోసమే కడతేరుస్తున్నారు
కేవలం కట్నం కోసమే భార్య ఉసురు తీస్తున్నారంటే ఈ పిశాచం ఎంతలా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. వేధింపులు భరించలేక, పుట్టింటి నుంచి అడిగినంత తెచ్చివ్వలేక ఎంతోమంది వివాహితలు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2024లో మొత్తం 144 మంది మహిళలు వరకట్న దాహానికి బలయ్యారు. రాష్ట్రంలో వరకట్న మరణాల రేటు 0.8గా నమోదైంది. ఇది దేశవ్యాప్త సగటు రేటు 0.8తో సమానంగా ఉన్నది.
కేసుల నమోదులో ఆయా రాష్ర్టాల జనాభాను బట్టి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముందు ఉండగా.. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ నిలిచింది. మరణాల్లో ఆయా రాష్ర్టాల జనాభానుబట్టి ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఒడిశా, హర్యానా తర్వాత తెలంగాణ ఉన్నది. కేసు ల సంఖ్యపరంగా తెలంగాణ 6, 9 స్థానాల్లో ఉన్నప్పటికీ.. జనాభా నిష్పత్తి/నేరాల రేటు ప్రకారం చూస్తే మాత్రం భర్త, అత్తమామల వేధింపుల్లో (52.8%) దేశంలోనే మొదటి స్థానంలో నిలువడం గమనార్హం. ఈ కట్న రకసిని అంతమొందించడానికి కేవలం చట్టాలు మాత్రమే సరిపోవు, సమాజంలో, ముఖ్యంగా పురుషుల ఆలోచనా విధానంలో మార్పు రావలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

