– బి. వీరేశం, జోగిపేట.
ఇంటిలో హెచ్చు తగ్గుల ఫ్లోరింగ్ మంచిదికాదు. ప్రతి ఇల్లు ఈశాన్యంలో కిందికి చేసి కట్టుకోవాలి అనిలేదు. ఈ మధ్య మానవులు చేసిన వికృత ప్రయోగాలు అవి. ఇంటి ఫ్లోరింగ్‌లో ఉన్న ఎత్తును బట్టి బయటి ఆవరణం కిందికి ఉండాలి. అంటే.. కాంపౌండ్ లోపల ఇంటి చుట్టు ఉన్న ప్రదేశం ఇంటికన్నా డౌనుగా ఉండాలి. అంతేకానీ, తూర్పు భాగం (ఆవరణం) ఇంటి ఈశాన్యం కన్నా ఎత్తుగా ఉండటం తప్పు. ఇందులో ప్రధాన అంశం ఇంటి ముందు ఉన్న తూర్పు ఓపెన్ ప్లేస్ కిందికి చేయడం. లేదా ఇంటి ఈశాన్యం గది ఫ్లోరింగ్ సమానంగా చేయడం. అలా సమానంగా చేసినప్పుడు ద్వారాలు, కిటికీలు కూడా సవరించాల్సి వస్తుంది. ఎత్తులు మారుతాయి కాబట్టి. అన్నీ సరిచూసుకొని చేయాల్సి ఉంటుంది. ఇంటి మొత్తాన్ని చూసి, ఇంటి చుట్టు ఉండే ఖాళీ ప్రదేశంలో కూడా హెచ్చుతగ్గులు, ఈశాన్యం వైపు పల్లంగా ఉండటం.. తదితర అన్ని అంశాలు తెలుసుకొని, లెక్క ప్రకారం సవరణలు చేయండి. శుభం.
– బి. రమేశ్, నర్సంపేట.
అపార్ట్మెంట్లలో సహజంగా ఫ్లాట్స్ అన్నీకూడా ఎదురు-ఎదురు ద్వారాలతో కడతారు. ఒక ఫ్లాట్‌కి తూర్పు-ఈశాన్యం ద్వారం వచ్చింది అంటే.. ఎదుటి ఇంటికి పడమర-వాయవ్యంలో ద్వారం తప్పక వస్తుంది. అన్ని చోట్ల దాదాపు ఒకే కొలతలు. అదే విధమైన గదుల విభజనతో అపార్ట్మెంట్లు నిర్మిస్తారు. కాబట్టి, ద్వారాలు అలా రావడం తప్పుకాదు. ఎదురు ద్వారాలు ఎప్పుడూ ఒక దానికి ఒకటి పోటీకావు. మీరు ద్వారం ఎదురు రావడం వల్ల మీ ప్రైవసీకి (ఎదురు ఇంట్లో వారు కనిపించడం) ఇబ్బంది అనిపిస్తే.. తూర్పు దిశలో ద్వారం మార్చుకోండి. ఇంటికి తూర్పు ద్వారం దోషం కాదు. మీకు ఎదురుగా ద్వారం రావడం ఇబ్బంది లేదు అంటే.. శాస్త్రపరంగా అలా ఉండటం తప్పుకాదు. కాబట్టి మార్చాల్సిన అవసరం లేదు. మనం అందరితో కలిసిమెలిసి ఉంటే.. అలా ఎదురు ద్వారాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి కదా! అన్నదమ్ముల ఇండ్లు అయితే.. అన్యోన్యత పెరుగుతుంది కదా! వ్యక్తిగతమై ఇబ్బందులు లేకుండా ఉంటే.. ఆ ద్వారాలు మార్చకండి.
– కె. కృప, రుద్రారం.
కట్టెలతో కిచెన్ అనేది పొగతో కూడుకొని ఉంటుంది. కాబట్టి, విశాలంగా ప్రధాన నిర్మాణాలకు దూరంగా ఉండాలి. కిచెన్ ఎప్పుడు, ఎక్కడ కట్టినా.. దానికి వెలుగు, గాలి ధారాళంగా రావాలి. అదే విధంగా వంట చేసేవారికి అనుకూలంగా ఉండాలి. కిచెన్ హాలుగా వేసుకొని దానిలో కట్టెల పొయ్యిని తూర్పు-ఆగ్నేయంలో పెట్టుకోవాలి.

కట్టెల మండిని హాలుకు దగ్గరలో పడమర లేదా దక్షిణంలో పెట్టుకోవచ్చు. హాస్టల్ గదులు ఒకచోట నిర్మించినప్పుడు దానికి అనుబంధంగా, దూరంగా ఆగ్నేయంలో ఈ కిచెన్, అలాగే డైనింగ్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. వంటను తూర్పు ముఖంగా చేసేలా పొయ్యిలు ఉండాలి.
– వి. లక్ష్మి, మారేడ్‌పల్లి.
భౌగోళిక వాతావరణం బాగున్నప్పుడే మనం బాగుంటాం. ఇల్లు పూర్తిగా భూ సంబంధ స్థితిగతులకు కట్టుబడి ఉంటుంది. ఒక చెక్కను గుండ్రంగా తయారు చేసినప్పుడు దానిని నేలమీద చక్రంగా తిప్పుకొంటూ తీసుకుపోవచ్చు. నాలుగు మూలల ముఖాలతో ఉన్న అదే చెక్కను మోసుకొని పోవాలి. అంటే, దాని ఆకారం దానికి ఒక కొత్త శక్తిని, అనుకూలతను అందించింది. అలా ఇల్లు ఏ దిశ, ఏ బ్లాకు అనే దానిని బట్టి దానిని ఎలా నిర్మించాలి? తద్వారా ఏం పొందుతాం? అనేది శాస్త్రం ముందే ప్రయోగబద్ధంగా లిఖించి పెట్టింది. ఆ విధంగా తూర్పు-ఉత్తరం వీధులు ఉన్న స్థలంలో గొయ్యితీసి (సెల్లార్) ఇల్లు కట్టకూడదు. ఆ ఇల్లు కొన్నారు అంటే.. బహుశా మీరు ఆ ఇంటికి.. రెండో లేదో మూడో యజమాని అయి ఉంటారు. ఈశాన్యం స్థలం గొప్పదన్న భావనతో దానికి ఉన్న అవలక్షణాలను గుర్తించకుండా తొందరపడవద్దు. మీరు ఆ ఇంటికి ఉన్న సెల్లారు మూసివేయండి. పైభాగం నుంచి ఆ డూప్లెక్స్ ఇల్లును వాడుకోండి. సెల్లారు మూయలేం, వద్దు అనుకుంటే.. దానిని కమర్షియల్‌గా రెంటుకు ఇవ్వండి. మనం ఎక్కింది ఆకాశంలో ఎగిరే విమానమే అయినా.. అది నేలమీదనే కదలడం లేదని తెలిశాక.. దానిలో ఎగిరి వెళ్లగలమా? సరైన నిర్ణయం తీసుకోండి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143