మధ్యప్రదేశ్‌లో ఆక్సిజన్ కొరత.. ఒకేరోజు నలుగురు మృతి
కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఆక్సిజన్ కరువైంది. ఒకేరోజు నలుగురు మృతిచెందారు.

భోపాల్ : కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఆక్సిజన్ కరువైంది. ఒకేరోజు నలుగురు మృతిచెందారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సరిపోయేంత ఉన్నదని ప్రభుత్వం ప్రకటించిన మరుసటిరోజే ఈ విషాధం చోటుచేసుకున్నది.
ఆక్సిజన్ అందక మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. భోపాల్‌లోని 20 కి పైగా ఆసుపత్రులలో ఆక్సిజన్ అందుబాటుపై గందరగోళం నెలకొన్నది.
ఎంపీ నగర్ లోని సిటీ హాస్పిటల్లో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఒకే రోజులో నలుగురు రోగులు మరణించారు. అలాగే, కరోండ్లోని పీజీబీఎం హాస్పిటల్లో ఒక మహిళ ఆక్సిజన్ లేకపోవడం వల్ల డిశ్చార్జ్ అవడంతో చనిపోయింది. హమీడియా సమీపంలోని అవిసేన ఆసుపత్రిలో ఆక్సిజన్ లేకపోవడంతో ముగ్గురు కోవిడ్ రోగులను దవాఖాన యాజమాన్యం తిప్పిపంపింది.
అవిసెనా ఆసుపత్రిలో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. రెండు సిలిండర్లు మాత్రమే మిగిలి ఉన్నాయని హాస్పిటల్ మేనేజర్ వైద్యులకు చెప్పినట్లు సమాచారం. ఈ రోజు సిలిండర్లను పంపిణీ చేయలేమని సరఫరాదారు భారత్ ఆక్సిజన్ చేతులు ఎత్తేసింది.
17 మంది రోగులను చేర్చుకోగా.. ప్రతిరోజూ 25 సిలిండర్లు వాడుతున్నామని, అయితే, ఇవాళ సగం లోడ్ కూడా రాలేదని అవిసెనా హాస్పిటల్ మేనేజర్ ఫైసల్ జమాల్ చెప్పారు. ముగ్గురు రోగులను తప్పనిసరి పరిస్థితుల్లో డిశ్చార్జ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆక్సిజన్ లేకపోవడం గురించి డ్రగ్ ఇన్స్పెక్టర్లకు లేఖ కూడా రాసినట్లు ఆయన చెప్పారు.
ఇలాఉండగా, పలు దవాఖానల్లో రోగులను ఇండ్లకు తీసుకెళ్లండి లేదంటే మీ ఆక్సిజన్ సిలిండర్లను మీరే తెచ్చుకోండి అని రోగుల బంధువులకు సూచిస్తున్నారు. ఖాళీ సిలిండర్లను తీసుకోవడానికి జనం ఒక్కసారిగా పరుగెత్తుకు రావడంతో గుర్జర్ ఆస్పత్రిలో తొక్కిసలాట జరిగింది.
‘నగరంలోని పలు కొవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్ సరఫరా లేకపోవడంపై ఫిర్యాదులు వచ్చాయి. ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా వారికి సిలిండర్లు సకాలంలో పంపుతున్నాం. ఆసుపత్రిలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎవరైనా చనిపోతే దానిని పరిశీలిస్తాం. రోజంతా 80 ఆస్పత్రులకు 46 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశాం’ అని భోపాల్ కలెక్టర్ అవినాష్ లవానియా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
జలియన్ వాలా బాగ్ మారణకాండ.. బ్రిటిషర్ల దురాగతానికి 102 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోం : సుప్రీంకోర్టు
సెనేట్‌లో మెజార్టీ సాధిద్దాం : డొనాల్డ్ ట్రంప్
మూడు రాష్ట్రాల్లో కొవిడ్ చర్యల్లో లోపాలు : గుర్తించిన కేంద్ర బృందాలు
అక్రమ ఆయుధ మార్కెట్: గన్ కావాలా పెషావర్ రండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

