గ్రీన్ కార్డుల కోసం కేపిటల్ హిల్ వద్ద భారత వైద్యుల ఆందోళన
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ సంతతి వైద్యులు గ్రీన్ కార్డ్ కోసం యూఎస్ పార్లమెంట్ కేపిటల్ హిల్ వద్ద ప్రదర్శన నిర్వహించారు

వాషింగ్టన్ : అమెరికాలో పనిచేస్తున్న భారతీయ సంతతి వైద్యులు గ్రీన్ కార్డ్ కోసం యూఎస్ పార్లమెంట్ కేపిటల్ హిల్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, దేశాల ప్రాతిపదికన సృష్టించిన కోటాను రద్దు చేయడానికి పార్లమెంటు చట్టాన్ని ఆమోదించాలని వారు కోరారు. గ్రీన్ కార్డ్ వలసదారులకు యూఎస్ లో శాశ్వతంగా నివసించే హక్కును ఇస్తుంది.
గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ 150 సంవత్సరాలుగా కొనసాగుతోందని, పురాతన కోటా నిర్ణయాత్మక విధానం అందులో జరుగుతున్నదని భారతీయ సంతతి వైద్యులు సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇందులో ఏ దేశ ప్రవాసికి ఏడు శాతానికి పైగా గ్రీన్ కార్డ్ లభించదు. భారతదేశ జనాభా కోట్లలో ఉన్నప్పటికీ భారతదేశానికి గ్రీన్ కార్డ్ కోటా చిన్న దేశం ఐస్లాండ్ జనాభాతో సమానం. అందుకే అమెరికా ప్రభుత్వం నిబంధనల్లోని అసమానతలను తొలగించాలి. యూఎస్‌లో పనిచేస్తున్న ఐటీ నిపుణులకు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన కోటాను రద్దు చేయాలని, గ్రీన్ కార్డ్ ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
భారతీయ-అమెరికన్ వైద్యులు పురాతన కంట్రీ క్యాప్స్ కారణంగా 150 ప్లస్ సంవత్సరాల గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌లో ఉన్నారని, ఇది ఏ దేశానికి ఏడు శాతం కంటే ఎక్కువ ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులను పొందటానికి అనుమతించదని సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో భారతీయ సంతతి వైద్యులు తెలిపారు.
భారతీయ ఐటీ నిపుణులు, వీరిలో ఎక్కువ మంది నైపుణ్యం కలిగినవారు, ప్రధానంగా హెచ్ -1 బీ వర్క్ వీసాలపై యూఎస్‌కు వచ్చారు. వీరు ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ బాధితులు. నైపుణ్యం కలిగిన నిపుణుల బాధలను అంతం చేయడానికి ద్వైపాక్షిక పరిష్కారంగా ఓటు వేయడానికి దీనిని పార్లమెంట్‌కు తీసుకురావాలని వారు కాంగ్రెస్ కు చెందిన జో లోఫ్గ్రెన్కు విజ్ఞప్తిచేశారు.
ఇవి కూడా చదవండి..
టిబెట్ సరిహద్దుల్లో 5 జీ నెట్వర్క్ విస్తరిస్తున్న చైనా
రెండేండ్లలో పెరిగిన బంగారం దిగుమతి
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
మధ్యప్రదేశ్‌లో ఆక్సిజన్ కొరత.. ఒకేరోజు నలుగురు మృతి
జలియన్ వాలా బాగ్ మారణకాండ.. బ్రిటిషర్ల దురాగతానికి 102 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోం : సుప్రీంకోర్టు
అక్రమ ఆయుధ మార్కెట్: గన్ కావాలా పెషావర్ రండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

