జూన్ 1 నుంచి హాల్‌మార్క్ నగలే అమ్మాలి..
వచ్చే జూన్ ఒకటో తారీఖు నుంచి బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి. ఇందుకోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది

ముంబై : వచ్చే జూన్ ఒకటో తారీఖు నుంచి బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి. ఇందుకోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. తొలుత ఈ విధానాన్ని 2021 జనవరి 1 నుంచి అమల్లోకి తేవాలని నిర్ణయించారు. అయితే ఆభరణాల డిమాండ్ మేరకు వచ్చే 6 నెలలకు ఇది వాయిదా పడింది. అంటే, ఇప్పుడు జూన్ 1 నుంచి హాల్‌మార్క్ గుర్తుతో ఉన్న ఆభరణాలు మాత్రమే లభించనున్నాయి. 2019 నవంబర్‌లో ప్రభుత్వం బంగారు ఆభరణాలు, డిజైన్ కోసం హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసింది.
నకిలీ ఆభరణాల నుంచి వినియోగదారులను రక్షించడానికి, ఆభరణాల వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి హాల్‌మార్కింగ్ అవసరం. బీఐఎస్ గుర్తించిన బంగారు నగలపై బీఐఎస్ త్రిభుజాకార గుర్తు, హాల్‌మార్కింగ్ సెంటర్ లోగో, బంగారం స్వచ్ఛత, నగలు తయారుచేసిన సంవత్సరం, లోగో కూడా ఉంటాయి.
దేశంలోని బంగారు నగల వర్తకులంతా హాల్‌మార్కింగ్‌కు మారడానికి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) లో నమోదు చేసుకోవడానికి ఏడాదికి పైగా సమయం ఇచ్చారు. తరువాత ఈ గడువును పెంచాలని నగల వ్యాపారులు డిమాండ్ చేయగా.. గడువును 2021 జూన్ 1 వరకు పెంచారు. ఇప్పటివరకు దేశంలోని 34,647 మంది ఆభరణాల వ్యాపారులు మాత్రమే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) లో హాల్‌మార్కింగ్ కోసం నమోదు చేసుకున్నారు.
లైసెన్స్‌దారుల ద్వారానే రావాలి
ఐదు సంవత్సరాల లైసెన్స్ రుసుము రూ.11,250 కు బీఐఎస్ స్వర్ణకారులకు లైసెన్స్ ఇస్తున్నది. ఆభరణాలను హాల్‌మార్క్ సెంటర్లో తనిఖీ చేసి, క్యారెట్ ప్రకారం హాల్‌మార్క్‌ను జారీ చేస్తారు. సామాన్యులు ఇలా తమ నగలకు హాల్‌మార్క్ పొందలేరు. వీరు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన వారి ద్వారానే రావాల్సి ఉంటుంది.
అయితే, కనీస మొత్తం చెల్లించడం ద్వారా హాల్‌మార్క్ సెంటర్లో వారి బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసుకోవచ్చని చెప్తున్నారు అధికారులు. గత ఏడాది ఆమోదించిన బీఐఎస్ చట్టం ప్రకారం, హాల్‌మార్కింగ్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఆభరణాల విలువకు రూ.1 లక్ష నుంచి 5 రెట్లు జరిమానా విధించే నిబంధన ఉన్నది.
ఇవి కూడా చదవండి..
సొంత ప్రజలపైనే కెమికల్ అటాక్.. సిరియా దుర్మార్గాన్ని బయటపెట్టిన నివేదిక
కుట్టుపిండి ఆహారాలు తిన్న 500 మందికి అస్వస్థత
సీబీఐ ఎదుట హాజరైన అనిల్ దేశ్‌ముఖ్
మహా దార్శనికుడు భీంరావ్ అంబేడ్కర్ : చరిత్రలో ఈరోజు
భారతీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అమెరికన్ సింగర్
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఇన్స్టాల్ చేయకండి..!
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

