e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News సొంత ప్ర‌జ‌ల‌పైనే కెమిక‌ల్ అటాక్.. సిరియా దుర్మార్గాన్ని బ‌య‌ట‌పెట్టిన నివేదిక‌

సొంత ప్ర‌జ‌ల‌పైనే కెమిక‌ల్ అటాక్.. సిరియా దుర్మార్గాన్ని బ‌య‌ట‌పెట్టిన నివేదిక‌

సొంత ప్ర‌జ‌ల‌పైనే కెమిక‌ల్ అటాక్.. సిరియా దుర్మార్గాన్ని బ‌య‌ట‌పెట్టిన నివేదిక‌

వాషింగ్టన్ : సొంత ప్ర‌జ‌ల‌పైనే కెమిక‌ల్ వెప‌న్స్‌తో దాడి చేశారంఊ సిరియా దుర్మార్గాన్ని అంత‌ర్జాతీయ సంస్థ నివేదిక ఒక‌టి బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. 2018 ఫిబ్రవరి 4 రాత్రి సిరియా సైన్యం షారకిబ్ పట్టణంపై హెలికాప్టర్‌తో రసాయన ఆయుధాల‌తో దాడి జ‌రిపార‌ని ఈ నివేదిక స్ప‌ష్టం చేసింది.

ఇంటర్నేషనల్ ప్రొహిబిషన్ ఆఫ్ ఆర్మ్స్ కమిషన్ (ఓపీసీడ‌బ్ల్యూ – ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్) దర్యాప్తులో ఇందుకు సంబంధించిన‌ ఆధారాలు లభించాయి. సంఘటన జరిగిన మూడేండ్ల‌ తర్వాత కమిషన్ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఐక్య‌రాజ్య సమితి డైరెక్టర్ జనరల్ ఆంటోనియో గుటారెస్‌కు సమర్పించారు.

ఆ రోజు రాత్రి క్లోరిన్ వాయువుతో సిరియా సైన్యం ఘోరమైన రసాయన ఆయుధాల‌తో సామాన్య ప్రజలపై దాడి చేసిందని నమ్మడానికి త‌మ వ‌ద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపింది.

ఈ దాడికి సంబంధించి 2020 సంవత్సరంలో కమిషన్ తన మొదటి నివేదికను విడుదల చేసింది. కాగా, తన రెండవ నివేదికలో, దర్యాప్తు బృందం రూపొందించిన తీర్మానాలు, ఇందులో క్లోరిన్ వాయువును ఉపయోగించాయని పేర్కొన్నాయి. దాని సిలిండర్లలో ఒకటి హెలికాప్టర్ నుంచి పడిపోయింది. దీనిలో నుంచి వాయువు ఈ ప్రాంతంలో చాలా వేగంగా వ్యాపించింది. కనీసం డజను మంది ప్రజలను ప్రభావితం చేసింది.

అయితే, ఈ దాడిలో ఎవరూ మరణించలేదు. క్లోరిన్ వాయువు దాడిలో ప్రజలకు కంటి చికాకు, శ్వాస సంబంధ సమస్యలు క‌నిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. దాని మితిమీరిన ఉపయోగం మానవుడిని చంపగలదని వారంటున్నారు.

బాధ్యుల‌ను శిక్షించాల్సిందే

ఈ నివేదికపై ఐరాస సెక్రటరీ జనరల్ గుటారెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని, దీనిని యుఎన్ తీవ్రంగా ఖండిస్తున్న‌ద‌ని గుటారెస్ మీడియాకు చెప్పారు. ఇలాంటి దాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎక్కడైనా సహించలేమని అన్నారు. ఇందుకు బాధ్యులైన‌ వ్యక్తులను చట్టం పరిధిలోకి తీసుకురావడం, వారిని శిక్షించడం కూడా అవసరమ‌ని పేర్కొన్నారు. దీనికి కారణమైన వారిని తెలుసుకోవాలని ఆయన చెప్పారు. ఈ దాడి జరిగిన ప్రాంతం సిరియన్ వైమానిక దళం టైగర్ ఫోర్సెస్ నియంత్రణలో ఉన్న‌ది.

సిరియా సైన్యం 2017 మార్చిలో ఆల్టమీనాలో రసాయన దాడి చేసిందని తొలి నివేదిక‌లో తెలిపారు. ఇందులో మ‌నిషి ఊపిరి పీల్చుకున్న కొద్దిసేపటికే నెర్వ్ ఏజెంట్ గ్యాస్ ప్రాణాలు తీసుకుంటుంది. యూఎన్‌ కన్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ బాడీ అయిన ఓపీసీడ‌బ్ల్యూ లో సుమారు 193 సభ్య దేశాలు ఉన్నాయి. రసాయన ఆయుధాల‌ను పూర్తిగా తొలగించే ప్రయత్నాలను కమిషన్ పర్యవేక్షిస్తుంది. ఇది 1997 లో ఉనికిలోకి వచ్చింది. ఈ క‌మిష‌న్ ప్రారంభ‌మైన‌ తరువాత దాదాపు 98 శాతం రసాయన ఆయుధాలు నాశనం చేశారు.

ఇవి కూడా చదవండి..

ఆప్రికాట్ పండ్ల‌తో ఆరోగ్యం

కుట్టుపిండి ఆహారాలు తిన్న‌ 500 మందికి అస్వ‌స్థ‌త‌

సీబీఐ ఎదుట హాజ‌రైన అనిల్ దేశ్‌ముఖ్

మ‌హా దార్శ‌నికుడు భీంరావ్ అంబేడ్క‌ర్ : చ‌రిత్ర‌లో ఈరోజు

భార‌తీయుల‌కు నూత‌న సంవత్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన అమెరిక‌న్ సింగ‌ర్

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ ఇన్‌స్టాల్ చేయ‌కండి..!

టీకా వేసుకోండి.. ఎక్కువ వ‌డ్డీ పొందండి..!

జూన్ నుంచి నిలిచిపోనున్న‌ గూగుల్ మొబైల్ షాపింగ్‌ యాప్ సేవ‌లు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
సొంత ప్ర‌జ‌ల‌పైనే కెమిక‌ల్ అటాక్.. సిరియా దుర్మార్గాన్ని బ‌య‌ట‌పెట్టిన నివేదిక‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement