Karuppu | తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి తన స్టార్ పవర్‌ను బాక్సాఫీస్ వద్ద నిరూపించారు. టాలెంటెడ్ దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కరుప్పు’ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. డివైన్ ఎలిమెంట్స్, కమర్షియల్ అంశాలు, భావోద్వేగాలతో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని అధిగమించి కొత్త రికార్డు సృష్టించింది. సినిమా విడుదలైనప్పటి నుంచి అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా సూర్య పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో కుటుంబ ప్రేక్షకులు, యువత, మాస్ ఆడియన్స్ నుంచి సమానమైన ఆదరణ లభిస్తోంది.
‘కరుప్పు’ కథలోని ఆధ్యాత్మిక నేపథ్యం, భారీ స్థాయి విజువల్ ట్రీట్, కమర్షియల్ ఎలిమెంట్స్ సమతుల్యత సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. ప్రేక్షకులను ఆరంభం నుంచి క్లైమాక్స్ వరకు ఆసక్తిగా కట్టిపడేసే విధంగా దర్శకుడు ఆర్జే బాలాజీ కథను తెరకెక్కించారని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే రెండు వారాల విజయవంతమైన రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో వారంలోకి కూడా అదే జోరుతో అడుగుపెట్టింది. సాధారణంగా పెద్ద సినిమాల వసూళ్లు రెండో వారానికే తగ్గుముఖం పడుతుంటాయి. కానీ ‘కరుప్పు’ మాత్రం వీక్‌డేస్‌లో కూడా బలమైన కలెక్షన్లు నమోదు చేస్తూ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
సినిమా విజయంలో సాంకేతిక విభాగం పాత్ర కూడా కీలకమైంది. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జి.కె. విష్ణు అందించిన అద్భుతమైన విజువల్స్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ నిర్మాణ విలువలు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.
రూ.300 కోట్ల మార్క్‌ను దాటిన ‘కరుప్పు’ ఇప్పుడు మరిన్ని వసూళ్ల రికార్డులపై కన్నేసింది. మూడో వారంలో కూడా థియేటర్లలో బలమైన ఆక్యుపెన్సీ కొనసాగుతుండటంతో ఈ చిత్రం ఫైనల్ రన్ ముగిసే సమయానికి మరిన్ని చారిత్రాత్మక రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్య కెరీర్లోనే కాకుండా, తమిళ సినీ పరిశ్రమలో కూడా ‘కరుప్పు’ ఒక ప్రత్యేక విజయగాథగా నిలిచేలా కనిపిస్తోంది.