TG DEECET Results | రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ కాలేజీల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ డీఈఈసెట్ 2026 (TG DEECET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 10.30 గంటల నుంచి అధికారిక వెబ్సైట్లో ఫలితాలను ఉంచామని అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జూన్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సర్టిఫికెట్ ధ్రువీకరణ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం జూన్ 6 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగనుంది.
మే 21వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,592 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 25,054 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 21,137 మంది అర్హత సాధించారు. అంటే మొత్తం 84.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
తెలుగు మీడియంలో 12,373 మంది దరఖాస్తు చేసుకోగా 9,612 మంది హాజరయ్యారు. వీరిలో 7918 మంది అర్హత సాధించారు. అంటే తెలుగు మీడియంలో ఉత్తీర్ణత శాతం 82.37గా నమోదైంది. ఇక ఇంగ్లీష్ విభాగంలో 88.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ విభాగంలో 18,985 మంది దరఖాస్తు చేసుకోగా.. 14,414 మంది పరీక్ష రాశారు. వీరిలో 12,784 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉర్దూ మీడియంలో 1234 మంది దరఖాస్తు చేసుకోగా.. 1028 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో కేవలం 435 మంది మాత్రమే అర్హత సాధించారు. ఉత్తీర్ణత శాతం 42.31గా నమోదైంది.