e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్‌ఖాన్‌

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్‌ఖాన్‌

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్‌ఖాన్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఏకంగా ఆర్థిక మంత్రినే మార్చారు. ఇలా ఆర్థిక మంత్రులను మార్చడం ఇది తొలిసారి కాదు.. రెండోసారి కాదు.. నాలుగోసారి.

కొత్త ఆర్థిక మంత్రిగా షౌకత్ తరీన్‌ను ఇమ్రాన్‌ఖాన్‌ శనివారం నియమించారు. హమద్ అజార్ స్థానంలో షౌకత్ తరీన్ ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. ద్రవ్యోల్బణాన్ని సక్రమంగా నిర్వహించలేదనే ఆరోపణలతో ఆర్థిక మంత్రి పదవి నుంచి డాక్టర్ అబ్దుల్ హఫీజ్ షేక్‌ను తొలగించారు. ఏం జరిగిందో తెలియదు గానీ, ఆయన స్థానంలో మార్చి చివరి రోజుల్లో హమద్‌ అజార్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు. హఫీజ్‌ షేక్‌కు ముందు 2018 లో అసద్‌ ఒమర్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

తన సిల్క్‌ బ్యాంక్ కోసం మూలధనాన్ని సమీకరించడానికి పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకోవడానికి ముందు తరీన్‌.. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (2009-10) ప్రభుత్వంలో స్వల్ప కాలం ఇదే మంత్రిత్వ శాఖను నిర్వహించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తరీన్‌.. తనకు క్లీన్‌చిట్‌ ఇచ్చేంతవరకు ఆర్థిక మంత్రి పదవిని స్వీకరించేందుకు తొలుత నిరాకరించాడు. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (నాబ్) అతడిపై ఉన్న అభియోగాలను విరమించుకున్నదీ? లేనేది తెలియరాలేదు.

వృత్తిపరంగా బ్యాంకర్ అయిన 68 ఏండ్ల తరీన్.. దేశ ఆర్థిక వ్యవస్థను ట్రాక్‌లోకి తీసుకొచ్చే పెద్ద బాధ్యతను భుజాలపై మోసేందుకు సిద్ధమయ్యారు. ఇస్లామాబాద్‌లో సిల్క్ బ్యాంక్‌ను తరీన్‌ స్థాపించాడు. అతను పాకిస్తాన్‌లో పెద్ద చక్కెర వ్యాపారవేత్త జహంగీర్ తరీన్ సోదరుడు. వీరిపై ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం కొన్ని వారాల క్రితం చక్కెర కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించింది. ఈ చక్కెర కుంభకోణం కారణంగా దేశంలో చక్కెర కొరత ఏర్పడింది. ధరలు గణనీయంగా పెరిగిపోయాయి.

కొత్త ఆర్థిక మంత్రిగా షౌకత్‌ తరీన్‌ను ఇమ్రాన్‌ఖాన్‌ నియమిచండంతో పాటు మంత్రిమండలిలో పలు మార్పులు చేశారు. హమద్ అజర్‌కు పరిశ్రమలు, పారిశ్రామిక ఉత్పత్తి శాఖ, ఫవాద్‌ చౌదరికి సమాచార శాఖ, షిబ్లి ఫరాజ్‌కు సైన్స్ శాఖ కేటాయించారు. కాగా, విద్యుత్‌ శాఖ మంత్రిగా ఉన్న ఉమర్‌ అయూబ్‌ ఖాన్‌కు ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెడ్‌గా నియమితులయ్యారు. 2018 లో పాక్‌ ప్రధాని పదవిని చేపట్టిన నాటి నుంచి ఇమ్రాన్ చాలా సార్లు తన క్యాబినెట్‌లో మార్పులు చేశారు. ఈ కారణంగా ప్రతిపక్షాల నుంచి పలు సార్లు చేదు వ్యాఖ్యలను ఎదుర్కోవలసి వచ్చింది.

‘ఇప్పటివరకు చాలా సార్లు క్యాబినెట్‌ మంత్రులను మార్చారు. అయినా ఎలాంటి ఫలితం కానరాలేదు. ఇక ప్రధానిని మారిస్తేనే ప్రయోజనం ఉంటుందేమో?’ అని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) కి సీనియర్‌ నేత ముర్తాజా వహాబ్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి..

రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు

స్పేస్‌ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన వ్యోమగామి కేట్‌ రూబిన్స్

నేపాల్‌లో వైభవంగా విషాల్‌ సింధూర్‌ జాతర

మేధోసంపత్తి అడ్డంకులు తొలగించండి.. బైడెన్‌కు ఎంపీల వినతి

రక్తం గడ్డకట్టకపోతే తీవ్ర ప్రమాదం.. చరిత్రలో ఈరోజు

బతుకుదెరువు కోసం ఆటో న‌డుపుతున్న జాతీయ బాక్సర్

టీకా ఆఫ‌ర్ : రిబెట్ ఇస్తున్న దుబాయ్ హోట‌ల్స్‌

జూన్ 1 నుంచి హాల్‌మార్క్ న‌గ‌లే అమ్మాలి..

ఆప్రికాట్ పండ్ల‌తో ఆరోగ్యం

టీకా వేసుకోండి.. ఎక్కువ వ‌డ్డీ పొందండి..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్‌ఖాన్‌

ట్రెండింగ్‌

Advertisement