ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
పాఠశాల ప్రిన్సిపాల్ చెంపదెబ్బ కొట్టడంతో అవమానంగా భావించిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్నది.

గుర్గావ్ : పాఠశాల ప్రిన్సిపాల్ చెంపదెబ్బ కొట్టడంతో అవమానంగా భావించిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాద సంఘటన ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్లో జరిగింది. ఓవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు మూతపడగా.. మరోవైపు గుర్గావ్లో పాఠశాల తెరిచి ఉంచడం, తోటి విద్యార్థుల ముందు ఓ బాలికను ప్రిన్సిపాల్ కొట్టడం చర్చనీయాంశమైంది.
గుర్గావ్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న ఓ 15 ఏండ్ల బాలిక పొడవైన చెవిపోగులు ధరించి స్కూలుకు రావడం, మొబైల్ ఫోన్ కలిగి ఉండటం, గోర్లు కత్తిరించుకోకపోవడం వంటి కారణాలతో ప్రిన్సిపాల్ ఆమెపై చేయి చేసుకున్నాడు. తోటి విద్యార్థుల ఎదుటే ఆ బాలిక చెంపపై కొట్టాడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ముభావంగా ఉండి ఎవరితోనూ మాట్లాడలేదు. అన్నం కూడా తినలేదు. విషయాన్ని తల్లిదండ్రులు ఆరా తీసేందుకు స్కూల్‌కు వెళ్లి.. ఆమ్మాయి పేరును రోల్స్ నుంచి తొలగించవద్దని వేడుకున్నారు.
ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేందుకు ఆమె మామ మొబైల్ ఫోన్ ఇచ్చాడని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అదే పాఠశాలలో చదువుతున్న వారి కుమారుడిని కూడా తొలగిస్తామని ప్రిన్సిపాల్ హెచ్చరించి వెళ్లిపొమ్మన్నాడు. దాంతో వారు ఇంటికి వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు మరోమారు ప్రిన్సిపాల్‌ను కలిసి రోల్స్ నుంచి తొలగించొద్దని కోరుతామని కుమార్తెకు చెప్పారు. అయితే, ఏమీ మాట్లాడకుండా ఉండిపోయిన సదరు బాలిక పై అంతస్థులోని గదికెళ్లి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.
తమ్ముడు ఈ విషయం గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. వెంటనే వారు ఆమెను సమీపంలోని దవాఖానకు తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. బాలిక మేనమామ ఫిర్యాదు మేరకు సదరు ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
నిత్యం 3 లక్షల రెమ్‌డెసివిర్ డోసుల ఉత్పత్తి : మన్సుఖ్ మాండవీయ
రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్
పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు
గ్రహాంతరవాసులతో పరిచయానికి దగ్గరికొస్తున్న మానవుడు..!?
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్‌ఖాన్
రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు
స్పేస్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన వ్యోమగామి కేట్ రూబిన్స్
మేధోసంపత్తి అడ్డంకులు తొలగించండి.. బైడెన్‌కు ఎంపీల వినతి
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
జూన్ 1 నుంచి హాల్‌మార్క్ నగలే అమ్మాలి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

