ఎల్ఐసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 16% వేతనాల పెంపు
ఎల్ఐసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్} భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఉద్యోగులకు శుభవార్త. వారి వేతనాలు 16 శాతం పెరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక....

న్యూఢిల్లీ: భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఉద్యోగులకు శుభవార్త. వారి వేతనాలు 16 శాతం పెరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక సేవల మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేసినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్ష మందికి పైగా ఎల్ఐసీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. దీంతోపాటు ఇక ఎల్ఐసీ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనివారం కూడా అమలులోకి రానున్నది
తక్షణం ఐదు రోజుల పనివారం
ఐటీ రంగ ఉద్యోగుల మాదిరిగానే ఎల్ఐసీ ఉద్యోగులకు కూడా శని, ఆదివారాలు సెలవులు ఉంటాయి. తక్షణం ఐదు రోజుల పనివారం అమలులోకి వస్తుంది. ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు ఎంతో కాలంగా ఐదు రోజుల పని విధానాన్ని అమలులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నాయి.
రూ.13,500 వరకు అదనపు స్పెషల్ అలవెన్స్
అంతేకాదు.. ఎల్ఐసీ ఉద్యోగులు తమ స్థాయిని బట్టి అదనపు స్పెషల్ అలవెన్స్ అందుకోబోతున్నారు. వారికి నెలకు రూ.1500 నుంచి రూ.13,500 వరకు ఈ అలవెన్స్ ద్వారా లబ్ధి చేకూరుతుంది.
అదనపు స్పెషల్ అలవెన్స్ అన్ని కేడర్లకూ
అన్ని కేడర్ల ఉద్యోగులకు ఈ అదనపు స్పెషల్ అలవెన్స్‌ను అమలు చేస్తున్నారు. కరువు భత్యానికి అనుగుణంగా దీన్ని ఖరారు చేశారు. అయితే, సిటీ కాంపన్సేషన్ అలవెన్స్, గ్రాట్యూటీ, హౌస్ రెంట్ అలవెన్స్, పెయిడ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అండ్ సూపర్న్యూమరేషన్ బెనిఫిట్స్ ఇందులో కలుపలేదు.
2017 నుంచి పెండింగ్‌లో వేతనాల పెరుగుదల
ప్రతి ఐదేండ్లకోసారి ఎల్ఐసీ ఉద్యోగుల వేతనాలు పెరుగతాయి. ఇంతకుముందు 2012లో ఎల్ఐసీ ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. షెడ్యూల్ ప్రకారం 2017లో పెరగాల్సి ఉన్నా పెండింగ్‌లో పెట్టారు.
దశాబ్దం తర్వాత వేతనాల పెంపు
దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఎల్ఐసీ ఉద్యోగుల వేతనాలు పెరుగుతున్నాయి. అయితే, ఉద్యోగులు 35 శాతం వేతనాలు పెరుగుతాయని అంచనా వేసినా, కేంద్రం మాత్రం 16 శాతమే పెంచింది.
ఈ ఏడాదిలోనే ఐపీవోకు ఎల్ఐసీ
స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీని లిస్టెడ్ కంపెనీగా చేర్చాలని కేంద్ంర భావిస్తున్నది. దీనికోసం ఐపీవో ప్రక్రియ కొనసాగుతున్నది.
గత ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ఎల్ఐసీని లిస్టెడ్ కంపెనీగా మారుస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఐపీవో ద్వారా ఎల్ఐసీ వాటాల విక్రయంతో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేస్తున్నది.
ఇవి కూడా చదవండి..
స్మార్ట్‌గా దోపిడీ.. రూ.5 లక్షలు చోరీ
బ్యాంక్ అలర్ట్ : ఆదివారం ఆర్టీజీఎస్ సేవలకు బ్రేక్!
ఐటీ ఉద్యోగాల జాతర
ఈనెల 30 వరకు గురుకులసెట్ దరఖాస్తులు
నీట్-2021వాయిదా
దేశంలోకి త్వరలో కొత్తగా 8 బ్యాంకులు
చౌక వడ్డీకే బంగారం లోన్.. ఈ బ్యాంకుల్లోనే..!
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ విలువ ఎంతంటే!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- salaries
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

