e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News చౌక వ‌డ్డీకే బంగారం లోన్‌.. ఈ బ్యాంకుల్లోనే..!

చౌక వ‌డ్డీకే బంగారం లోన్‌.. ఈ బ్యాంకుల్లోనే..!

చౌక వ‌డ్డీకే బంగారం లోన్‌.. ఈ బ్యాంకుల్లోనే..!

న్యూఢిల్లీ: ద‌వాఖాన పాలైనా.. వ్య‌వ‌సాయ అవ‌స‌రాల‌కైనా.. పిల్ల‌ల స్కూల్ లేదా కాలేజీ ఫీజుల‌కైనా అత్య‌వ‌స‌రంగా డ‌బ్బు అవ‌స‌ర‌మైతే.. గోల్డ్ లోన్ బెస్ట్ ఆప్ష‌న్ కానున్న‌ది. బంగారంపై అప్పు తీసుకోవ‌డానికి మీరు మంచి క్రెడిట్ స్కోర్ రికార్డు గానీ, ఆదాయం ప్రూఫ్ గానీ స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రం లేదు.

18 ఏండ్లు దాటిన ప్ర‌తి వ్య‌క్తి బంగారంపై రుణం తీసుకునేందుకు అర్హులే. బ్యాంకులు, బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు (ఎన్బీఎఫ్సీ) బంగారం రుణాలిస్తున్నాయి.

త‌క్ష‌ణ అవ‌స‌రాల‌ను తీర్చేందుకు ఏ స‌మ‌స్య‌ల్లేకుండా చౌక‌గా ల‌భించే రుణ‌మే గోల్డ్ లోన్‌. సాధార‌ణంగా ఇంట్లో భార్య‌లు ధ‌రించే ఆభ‌ర‌ణాలు, ఇత‌ర బంగారంపై రుణం ఇస్తారు.

ఈ రుణం మంజూరు చేయ‌డానికి అధిక క్రెడిట్ స్కోర్ అవ‌స‌ర‌మే లేదు. చాలా త‌క్కువ టైంలోనే బంగారంపై రుణం ల‌భిస్తుంది. బంగారంపై రుణాల్లో ముఖ్య‌మైన అంశాలేమిటో ఒక‌సారి చూద్దామా..

బంగారంపై రుణం గ‌డువు రెండేండ్ల వ‌ర‌కు ఉంటుంది. దాన్ని త‌ర్వాత పున‌రుద్ధ‌రించుకోవ‌చ్చు. బంగారంపై రుణం తీసుకుంటే మీ వ‌ద్ద ఉన్న ఆభ‌ర‌ణాలు, బంగారం క‌డ్డీ, బంగారం నాణెం పూచీక‌త్తుగా తాక‌ట్టు పెట్టాల్సి ఉంటుంది.

బ్యాంకులు బంగారంలో 80 శాతం విలువ‌పై మాత్ర‌మే రుణం మంజూరు చేస్తాయి. బంగారంపై విలువ కంటే ఎక్కువ రుణం తీసుకుంటే ఎక్క‌వ వ‌డ్డీరేటు చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంకులు బంగారంపై రుణాల చెల్లింపున‌కు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్ష‌న్లు ఆఫ‌ర్ చేస్తున్నాయి. మీరు ఈఎంఐ ఆప్ష‌న్ గానీ, ఒకేసారి మొత్తం రుణం గానీ చెల్లించొచ్చు. బంగారంపై రుణ చెల్లింపున‌కు పాక్షిక చెల్లింపు ఆప్ష‌న్ కూడా ల‌భిస్తుంది.

బంగారంపై రుణం తీసుకోవాలంటే మీరు గుడ్ క్రెడిట్ హిస్ట‌రీ క‌లిగి ఉండాల్సిన అవ‌స‌రం లేదు. కానీ మీకు గుడ్ క్రెడిట్ హిస్ట‌రీ ఉంటే.. మీకు చౌక వ‌డ్డీరేటుకే బంగారం రుణం ల‌భిస్తుంది.

బంగారంపై రుణం తీసుకోవ‌డానికి స‌మ‌ర్పించాల్సిన ప‌త్రాలు కూడా కొన్నే ఉంటాయి. మీ గుర్తింపు, నివాస గుర్తింపుతోపాటు పాన్ కార్డు స‌మ‌ర్పిస్తే బంగారంపై రుణం తీసుకోవ‌చ్చు.

బంగారంపై రుణం సుర‌క్షిత‌మైంది. ప‌ర్స‌న‌ల్ లోన్ కంటే త‌క్కువ వ‌డ్డీరేటు వ‌ర్తిస్తుంది. ప‌ర్స‌న‌ల్ లోన్ అన్ సెక్యూర్డ్ లోన్‌.

మీ జాబ్ ప్రొఫైల్‌, క్రెడిట్ స్కోర్ ఆధారంగా 10-15 శాతం మ‌ధ్య బ్యాంకులు ప‌ర్స‌న‌ల్ లోన్లు మంజూరు చేస్తున్నాయి. కానీ గోల్డ్ రుణాలు 7 శాతం వ‌డ్డీరేటు నుంచి మొద‌ల‌వుతాయి.

అతి త‌క్కువ వ‌డ్డీరేటుపై చౌక‌గా బంగారం రుణాలిస్తున్న బ్యాంకుల‌ను చూద్దాం..

బ్యాంక్ పేరు– వ‌డ్డీరేటు
పంజాబ్ సింధ్ బ్యాంక్‌-7%
యూనియ‌న్ బ్యాంక్ – 7.20%
బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.35%
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-7.5%
కెన‌రా బ్యాంక్‌- 7.65 %

ఇవి కూడా చదవండి:

ఈనెల 30 వ‌ర‌కు గురుకుల‌సెట్‌ దర‌ఖాస్తులు

నీట్‌-2021వాయిదా
కుంభమేళాలో 5 రోజుల్లో 1700 మందికి కరోనా

చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మూసివేసిన ఏఎస్‌ఐ

రాజస్థాన్‌లో నేటి నుంచి వారాంతపు నైట్‌ కర్ఫ్యూ
ఢిల్లీపై కరోనా పంజా.. ఒకే బెడ్‌పై ఇద్దరు..

ఏడాదిలో మూడో టీకా అవసరం : ఫైజర్‌ సీఈఓ

తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌కు కరోనా

దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 2లక్షలకుపైగా కేసులు.. 1,185 మంది మృతి

కరోనా సెకండ్‌ వేవ్‌ను అధిగమించడం పెద్ద సవాలే : కేంద్రమంత్రి

టీసీఎల్ న్యూ కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌! ఎలాగంటే!!

డాల‌ర్‌తో 58 పైస‌లు బ‌ల‌ప‌డిన రూపాయి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చౌక వ‌డ్డీకే బంగారం లోన్‌.. ఈ బ్యాంకుల్లోనే..!

ట్రెండింగ్‌

Advertisement