రాజాపేట జూన్ 1 : రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని ప్రకటించినప్పటికీ, కొనుగోలు కేంద్రాల్లో ఇంకా పెద్ద మొత్తం లో ధాన్యం ఉందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాజాపేటలో ఆమె మాట్లాడుతూ పలు కేంద్రాల్లో 50 శాతం ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని, రైతు సమస్యలపై ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నకిలీ విత్తనాలు, యూరియా సరఫరాలో ఇబ్బందులు, విద్యుత్తు కోతలు, ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వంటి సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
మరో రెండు రోజుల్లో అయినా పెండింగ్లో ఉన్న మొత్తం ధాన్యా న్ని కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరు రామచంద్రారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ చింతలపూడి భాసర్ రెడ్డి, మదర్ డెయిరీ మాజీ డైరెక్టర్ చింతలపూడి వెంకటరామిరెడ్డి, ఆత్మ చైర్మన్ మేకల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, మారెట్ మాజీ డైరెక్టర్లు గుర్రం నరసింహులు, గుంటి కృష్ణ, జలసాధన సమితి అధ్యక్షుడు ఎర్గోకుల జశ్వంత్, బొంగోని ఉప్పలయ్య, ఇంజ నరసయ్య, ములుగు సోమలింగం గుప్తా, గజ్జల రాజు, ఇంజ బాబు, సత్త య్య, భాసర్ తదితరులు ఉన్నారు.