ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒకే రోజులో 58 పైసలు బలపడటం విశేషం. శుక్రవారం 74.35 దగ్గర ముగిసింది. గురువారం రూపాయి విలువ 74.93గా ఉంది. ఈ వారం మొత్తంలో చూస్తే 0.5 శాతం మేర రూపాయి బలపడింది. అటు సెన్సెక్స్ కూడా శుక్రవారం 28 పాయింట్ల స్వల్ప లాభంతో ముగిసింది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంపై కొంత కాలంగా రూపాయిపై ప్రభావం చూపింది. దీంతో రూపాయి విలువ దారుణంగా పతనమైంది. అయితే అటు డాలర్ బలహీనపడటం రూపాయికి కలిసి వచ్చింది. దీంతో శుక్రవారం కాస్త కోలుకుంది.