హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో రెసోనెన్స్ జూనియర్ కాలేజీలు విజయ కేతనం ఎగురవేశాయి. ఓపెన్, ఇతర క్యాటగిరీల్లో 17 మంది విద్యార్థులు వెయ్యిలోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. వివిధ క్యాంపస్ల నుంచి 185 మందికి పైగా విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలు పొందనున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెసోనెన్స్ విద్యాసంస్థల డైరెక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ అద్భుతమని కొనియాడారు. ప్రతిభ చూపిన విద్యార్థులు, ఫ్యాకల్టీని అభినందించారు.