హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ పూర్వ విద్యార్థులు వివిధ క్యాటగిరీల్లో మొదటి 100లోపు 16 ర్యాంకులు సాధించారు. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీల్లో పసల మోహిత్ 26, బిజ్జం వెంకటచంద్రశేఖర్రెడ్డి 38, చిన్ని పవన్ తేజ 56వ ర్యాంకులతోపాటు వివిధ క్యాటగిరీల్లో 9, 22, 22, 24, 26, 31, 35, 38, 46, 49, 55, 56, 74, 79, 80, 80 వంటి 16 ర్యాంకులు సాధించారు.
ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బందికి సంస్థ యాజమాన్యం అభినందనలు తెలియజేసింది.