చెట్ల నీడే.. వెయిటింగ్ హాల్
నిమ్స్‌లో చికిత్స కోసం వచ్చే క్యాన్సర్ రోగుల సహాయకులకు చెట్ల నీడే వెయిటిం గ్ హాల్‌గా మారిందన్న ఆరోపణలున్నాయి. ఆస్పత్రిలో అత్యంత కీలకమైన ఆంకాలజీ విభాగానికి నిత్యం వందలాదిగా రోగులు, వారి సహాయకులు వస్తుంటారు. ఇదే భవనంలో రేడియేషన్, న్యూక్లియర్ విభాగాలు ఉండడంతో ప్రధానంగా క్యాన్సర్ రోగ నిర్ధారణ జరిగిన తర్వాత కీమో, రేడియేషన్ తదితర ప్రక్రియలు ఈ విభాగంలోనే నిర్వహిస్తూ ఉంటారు.
- నిమ్స్‌లో క్యాన్సర్ రోగుల సహాయకులకు తప్పని తిప్పలు
ఖైరతాబాద్, జూన్ 1 : నిమ్స్‌లో చికిత్స కోసం వచ్చే క్యాన్సర్ రోగుల సహాయకులకు చెట్ల నీడే వెయిటిం గ్ హాల్‌గా మారిందన్న ఆరోపణలున్నాయి. ఆస్పత్రిలో అత్యంత కీలకమైన ఆంకాలజీ విభాగానికి నిత్యం వందలాదిగా రోగులు, వారి సహాయకులు వస్తుంటారు. ఇదే భవనంలో రేడియేషన్, న్యూక్లియర్ విభాగాలు ఉండడంతో ప్రధానంగా క్యాన్సర్ రోగ నిర్ధారణ జరిగిన తర్వాత కీమో, రేడియేషన్ తదితర ప్రక్రియలు ఈ విభాగంలోనే నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రోగులకు సరిపడా స్థలాన్ని కేటాయించి.. వెయింటింగ్ హాల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉండగా, యాజమాన్యం నిర్లక్ష్యంగా రేడియేషన్ ఆంకాలజీ విభా గం బయట చెట్ల కిందే కుర్చీలు వేయించడం విశే షం.
నిమ్స్‌కు వచ్చే రోగులు, వారి సహాయకుల కోసం రూ.5 కోట్లతో ఉచిత వైఫై సేవలు, లక్షలాది రూపాయలు వెచ్చించి రోబోలను ఏర్పాటు చేసిన యాజమాన్యం.. చికిత్స కోసం వచ్చే వారికి వసతులు కల్పించడంలో విఫలమైందని పలువురు ఆరోపిస్తున్నారు. పేదల పెద్దాసుస్పత్రిగా పేరున్న నిమ్స్‌కు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం తోపాటు రోగుల ఫీజుల ద్వారా కూడా రూ. కోట్లు సమకూరుతాయి.
దీనికి తోడు పలు స్వచ్ఛంద సంస్థలు నిమ్స్‌లోని అనేక కీలక విభాగాలకు ఆధునిక సౌకర్యాలు, పరికరాలను సమకూరుస్తుంటాయి. ఇప్పటికైనా ఆంకాలజీ విభాగానికి వచ్చే రోగులకు వసతులు కల్పించాలని, ప్రత్యేక వెయింటింగ్ హాళ్లను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

