e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌పై ట్విట్ట‌ర్ ఆరోప‌ణ నిరాధారం!

భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌పై ట్విట్ట‌ర్ ఆరోప‌ణ నిరాధారం!

భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌పై ట్విట్ట‌ర్ ఆరోప‌ణ నిరాధారం!

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్ట‌ర్ చేసిన ఆరోప‌ణ‌లు నిరాధారం అని కేంద్రం పేర్కొంది. మ్యానిపులేటెడ్ మీడియా ట్యాగ్ విష‌య‌మై ఢిల్లీ పోలీసులు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని అంత‌కుముందు ట్విట్ట‌ర్ ఆరోపించింది. ట్విట్ట‌ర్ ప్ర‌క‌ట‌న‌ను తీవ్రంగా ఖండించిన ఐటీ మంత్రిత్వ‌శాఖ.. ఇది భార‌త్‌ను అప్ర‌తిష్ట పాల్జేసే య‌త్నం అని మండి ప‌డింది.

ట్విట్ట‌ర్‌తో స‌హా సోషల్ మీడియా కంపెనీల ప్ర‌తినిధులంతా భార‌త్‌లో సుర‌క్షితంగా, భ‌ద్రంగానే ఉంటార‌ని ఐటీ మంత్రిత్వ‌శాఖ పేర్కొంది. వారి వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కు ఏ ముప్పు లేద‌న్న‌ది. భావ స్వేచ్ఛపై ప్ర‌పంచం లోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశానికి ట్విట్ట‌ర్ నీతులు చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని ఆరోపించింది.

ట్విట్ట‌ర్ త‌న చ‌ర్య‌ల ద్వారా ఉద్దేశ‌పూర్వ‌కంగా ధిక్కార స్వ‌రం వినిపిస్తున్న‌ద‌ని కేంద్ర ఐటీ మంత్రిత్వ‌శాఖ వ్యాఖ్యానించింది. భార‌త్ లీగ‌ల్ వ్య‌వ‌స్థ‌ను త‌క్కువ చేసేందుకు య‌త్నిస్తున్న‌ద‌న్నది.

కొవిడ్‌-19పై పోరులో కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విప‌క్ష నేత‌లు రూపొందించుకున్న కార్యాచ‌ర‌ణ పేరుతో విడుద‌లైన టూల్ కిట్‌ను బీజేపీ నేత‌లు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ల‌ను ట్విట్ట‌ర్‌.. మ్యానుపులేటెడ్ ట్వీట్స్‌గా అభివ‌ర్ణించ‌డం కేంద్రం ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది.

దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు.. ట్విట్ట‌ర్ కార్యాల‌యానికి వెళ్లి నోటీసులు అంద‌జేశారు. ఇది త‌మ‌ను బెదిరించ‌డ‌మేన‌ని ట్విట్ట‌ర్ వ్యాఖ్యానించింది.

త‌మ‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేయ‌డంతో త‌మ సిబ్బంది భ‌ద్ర‌త‌పై ట్విట్ట‌ర్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అలాగే భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు ముప్పు పొంచి ఉంద‌ని పేర్కొంది.

ఇవి కూడా చ‌ద‌వండి:

నోట్లు ముద్రించడమే మార్గం.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

ప్ర‌పంచంలో అత్యంత కుబేరుడిగా జెఫ్ బెజోస్ స్థానం ప‌దిలం

వ్యాక్సినేష‌న్ తోనే ఎకాన‌మీపై మ‌హ‌మ్మారి ఎఫెక్ట్ కు చెక్ : ఆర్బీఐ

వ్యాక్సిన్లపై పన్ను కోతలేనట్లే!

30 రోజుల్లో వాపస్‌

హనుమంతుని జన్మస్థలంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ

తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో రేపు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌

ఐటీ కొత్త రూల్స్‌.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ట్విట్ట‌ర్ సంస్థ‌

మామిడి పండ్లు తిన‌గానే ఆ ఐదింటి జోలికి అస‌లే పోవ‌ద్దు..!

నన్నెవ‌రూ అరెస్ట్ చేయ‌లేరు : రాందేవ్ బాబా

యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ట్రయల్స్‌కు జైడస్‌ దరఖాస్తు

భార‌తీయ ఐటీ చ‌ట్టాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం : గూగుల్ సీఈవో

12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్‌ సురక్షితం : ఫైజర్‌

దగ్ధమైన సింగపూర్ నౌక.. పర్యావరణానికి పెనుముప్పు

మెహుల్‌ చోక్సీ దొరికాడు..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌పై ట్విట్ట‌ర్ ఆరోప‌ణ నిరాధారం!

ట్రెండింగ్‌

Advertisement