న్యూఢిల్లీ, మే 10: ఎక్స్‌లో ఇప్పుడు పూర్తి నిడివి సినిమాలు పోస్ట్ చేయొచ్చని టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ శుక్రవారం వెల్లడించారు. వీటితోపాటు టీవీ సిరీస్‌లు, పాడ్ కాస్ట్లను ఎక్స్‌లో పోస్ట్ చేసి మానిటైజేషన్ ద్వారా డబ్బు సంపాదించొచ్చని తెలిపారు. త్వరలోనే ఎక్స్‌లో ‘ఏఐ ఆడియెన్సెస్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.
తన సోదరి టోస్కా మస్క్‌కు ఎక్స్‌లో ప్రత్యుత్తరం ఇస్తూ ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఏఐ ఆడియెన్సెస్ ఫీచర్ ద్వారా ప్రకటనదారులు లక్షిత వ్యక్తులకు తమ అడ్వైర్టెజ్‌మెంట్ గురించి తెలియజేయవచ్చు.