Hansika | విడాకుల తర్వాత హన్సిక తొలి పోస్ట్.. కష్టాలలోను పాజిటివ్‌గా, ధైర్యంగా ఉండాలంటూ కామెంట్
Hansika | టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన అందం, నటనతో అలరించిన ప్రముఖ నటి హన్సిక మోత్వాని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్త నెట్టింట ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోహైల్ కతూరియాని ప్రేమించి పెళ్లి చేసుకున్న హన్సిక అతనికి విడాకులు ఇచ్చినట్టు జోరుగా ప్రచారం సాగింది.
Hansika | టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన అందం, నటనతో అలరించిన ప్రముఖ నటి హన్సిక మోత్వాని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్త నెట్టింట ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోహైల్ కతూరియాని ప్రేమించి పెళ్లి చేసుకున్న హన్సిక అతనికి విడాకులు ఇచ్చినట్టు జోరుగా ప్రచారం సాగింది. కొంతకాలంగా ఈ జంట మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండగా, ముంబైలోని బాంద్రా కోర్టు వీరి విడాకులను ఖరారు చేసిందని కొన్ని మీడియా వర్గాల్లో వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే తాజాగా హన్సిక తన సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
చర్ది కాలా ఆల్వేస్ అనే పంజాబీ కొటేషన్ షేర్ చేయగా, దాని అర్ధం ఏంటంటే.. ఎలాంటి కష్టాలలో ఉన్నా కూడా పాజిటివ్‌గా, ధైర్యంగా ఉండాలని దీని అర్ధం.అంటే తన జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభించడానికి తాను సిద్ధంగా ఉన్నానని హన్సిక ఇన్‌డైరెక్ట్ కామెంట్ పెట్టి ఉంటుందని నెటిజన్స్ భావిసక్తున్నారు. ఇక హన్సిక మోత్వానీ, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా 2022 డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని జైపూర్‌లో అట్టహాసంగా జరగగా, ఈ పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్‌గా జరిగి అప్పట్లో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పెళ్లి తర్వాత కొంతకాలం వరకు ఈ జంట సంతోషంగా జీవిస్తున్నట్లు కనిపించింది.
అయితే పెళ్లి అనంతరం కొన్ని నెలలకే వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. గత కొంతకాలంగా హన్సిక తన భర్తకు దూరంగా ఉంటూ తల్లితో కలిసి నివసిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో హన్సిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి భర్తతో కలిసి ఉన్న పెళ్లి ఫోటోలను తొలగించడం కూడా ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. దీంతో ఈ జంట మధ్య సంబంధాలు సరిగా లేవని అభిమానులు భావించారు. హన్సిక వివాహం జరిగిన సమయంలో కూడా కొన్ని వివాదాలు చర్చనీయాంశమయ్యాయి. సోహైల్ కతూరియాకు ఇది రెండో వివాహం కాగా, అతని మొదటి భార్య హన్సికకు సన్నిహిత స్నేహితురాలు అన్న వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ ట్రోల్స్‌పై హన్సిక స్పందిస్తూ, సోహైల్ గతం తనకు తెలుసని , వారు విడిపోవడానికి తాను కారణం కాదని స్పష్టం చేశారు. అయితే హన్సిక, సోహైల్ కతూరియా విడిపోవడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా బయటకు రాలేదు. వ్యక్తిగత విభేదాల కారణంగానే ఈ జంట విడాకులు తీసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

