OTT Movies | మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు’ చివరకు ఓటిటిలోకి వచ్చేసింది. దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందించిన ఈ సినిమాలో హీరోయిన్లుగా ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి నటించారు. ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రవితేజ స్టైల్ మాస్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు. మాస్ మహారాజా గత కొన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమా థియేటర్లలో మంచి రన్‌ను నమోదు చేసింది.
అయితే థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి కొంత సమయం పట్టింది. ఇతర సినిమాలు తక్కువ సమయంలోనే ఓటిటిలోకి వస్తున్న నేపథ్యంలో ‘భర్త మహాశయులకు’ మాత్రం ఆలస్యంగా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్ ZEE5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని తెలుగు మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉంచారు. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు ఓటిటిలో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు అనుదీప్ కే వి తెరకెక్కించిన ఫన్ డ్రామా చిత్రమే “ఫంకీ” థియేటర్స్ లో ఒక డిజప్పాయింట్ చేయగా, ఈ మూవీ ఫైనల్ గా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చిత్రాన్ని పాపులర్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఈ సినిమా నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. అనుదీప్ గత సినిమా ప్రిన్స్ కూడా థియేటర్స్ తర్వాత ఓటీటీ లోకి వచ్చాక ఓ వర్గం ఆడియెన్స్ ని ఫ్యాన్స్ చేసుకుంది. మరి అలానే ఫంకీ కి కూడా జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.