న్యూఢిల్లీ: జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన పోలో కారు సిరీస్‌లో కంఫర్ట్‌లైన్ ట్రిమ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మోడల్‌ను దేశీయ విపణిలో ఆవిష్కరించింది. ఈ కారు ధరను రూ.8.51లక్షలని నిర్ణయించారు.
ప్రీమియం వేరియంట్లకు మాత్రమే గతంలో ఆటోమేటిక్ ఆప్షన్ ఉండేది. వాటి ఎక్స్‌షోరూమ్ ధర రూ. 9.45 లక్షలుగా ఉండేది. దీంతో పోలిస్తే కొత్త వేరియంట్ ధర రూ. లక్ష చౌక. దీంతోపాటు ఈ సరికొత్త కారులో ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్,బ్లూపంక్ మ్యూజిక్ సిస్టమ్‌ను ఫోక్స్ వ్యాగన్ అందిస్తున్నది.
ఈ సందర్భంగా ఫోక్స్‌వ్యాగన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశీష్ గుప్తా మాట్లాడుతూ ‘పోలో ఫ్యామిలీలో కొత్త ట్రిమ్ మోడల్ కారును ప్రవేశపెట్టడానికి మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం. మమ్మల్ని ప్రోత్సహించే కస్టమర్ల కోసం కంఫర్ట్‌లైన్ టీఎస్ఐ ఏటీని ప్రవేశపెట్టాం. ఈ సెగ్మెంట్లో పోలో బలమైన పోటీదారుగా నిలుస్తుంది’ అని అన్నారు.
ఇక ఈ కొత్తకారు ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు లేవు. గత మోడల్ కారులో వలే ఒక లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుంది. ఇది 109 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. వినియోగదారులకు ఫ్లాష్ రెడ్, సన్‌సెట్ రెడ్, క్యాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్, కార్బన్ స్టీల్ రంగుల్లో కొత్త కారు లభిస్తుంది.
ఇంటి పెద్దను కోల్పోతే రుణ చెల్లింపులు ఎలా..?
ముకేశ్ అంబానీ గతేడాది జీతం సున్నా.. ఎందుకో తెలుసా?
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ , అదానీ పోర్ట్స్…
2.27 కోట్లు.. ఏప్రిల్, మే నెలల్లో కోల్పోయిన ఉద్యోగాలు
లక్షమందికి ఉచిత వ్యాక్సిన్లు: మలబార్
రికార్డు గరిష్టానికి స్టాక్ మార్కెట్లు
ఇప్పుడు కొన్నా.. 3 నెలలకు ఈఎంఐ షురూ.. మహీంద్రా ఆఫర్ !
బిట్ కాయిన్ ముందు ఐదు సవాళ్లు.. అవేంటంటే?!
రెండేళ్ల చిన్నారి..205 దేశాల రాజధానుల పేర్లు చెప్పేస్తోంది.. వీడియో
ఇజ్రాయెల్‌లో అధికార మార్పు: ప్రధానమంత్రిగా బెన్నెట్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
Poco M3 Pro: పొకో నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్ ఇదే..!
మహేష్ ముందడుగు.. అభిమానులలో ఉత్సాహం
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి