T20 World Cup : ఐపీఎల్ పదిహేడో సీజన్‌తో టీమిండియా టీ20 వరల్డ్ కప్ జట్టు(T20 Wolrd Cup)లోకి వచ్చేదెవరో తేలిపోనుంది. ఇప్పటికే కొందరు ఆటగాళ్ల బెర్తులు ఖరారు కాగా.. మరికొందరు నీలి జెర్సీతో మురిసిపోవాలని ఆతృతగా ఎదరుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్(Ajit Agarkar) నేతృత్వంలోని సెలెక్టర్లు ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై సన్నాహకాలు మొదలెట్టారు. ఈ సమయంలో భారత మాజీ స్పీన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించాడు.
పదిహేడో సీజన్లో విఫలమవుతున్న పలువురిని భజ్జీ అసలు లెక్కనే చేయలేదు. ఆల్‌రౌండర్ జాబితాలో హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) బదులు శివం దూబే చోటు దక్కించుకోగా.. యువకెరటం శుభ్‌మన్ గిల్ స్థానంలో యశస్వీ జైస్వాలో కర్చీఫ్ వేశాడు. వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్(Rishabh Pant), సంజూ శాంసన్‌లు ఎంపికవ్వగా యూనిట్లో అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్‌లతో పాటు ఐపీఎల్ 17వ సీజన్లో వేగవంతమై బంతి విసిరిన మయాంక్ యాదవ్ తుది స్క్వాడ్‌లోకి దూసుకొచ్చాడు.
Fans, get ready to rumble! #T20WC2024 is almost here, and @harbhajan_singh, our #IncredibleStarcast icon, has picked his set of 15 that will get a #VisaToWorldCup!
Think he missed a crucial player? This is YOUR chance to challenge the Legend! Head over to our social media (23rd… pic.twitter.com/7DDD2aAMP7
— Star Sports (@StarSportsIndia) April 25, 2024
భజ్జీ ప్రకటించిన పొట్టి ప్రపంచ కప్ స్క్వాడ్ : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, శివం దూబే, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.
ప్రపంచంలోనే మేటి జట్లలో ఒకటైన భారత్.. ఐసీసీ ట్రోఫీని ముద్దాడి 11 ఏండ్లు దాటింది. మాజీ సారథి ఎంఎస్ ధోనీ(MS Dhoni) సారథ్యంలో 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా ఆ తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీ(ICC Trophy) కొట్టలేదు. గత రెండేండ్లలో మూడుసార్లు ఫైనల్ చేరినా టైటిల్ సాధించలేకపోయింది. కోహ్లీ సారథ్యంలో టెస్టు గద(Test Mace) చేజారగా.. నిరుడు రోహిత్ నేతృత్వంలోని భారత్ డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) ట్రోఫీలను ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. దాంతో, ఈ ఏడాది వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచకప్‌పై రోహిత్ సేన గురి పెట్టింది.