(Somu Veerraju) విజయవాడ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం, ఇతర అంశాలపై ఏపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన సోము వీర్రాజు.. రాజకీయా జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏనాడూ పదవుల కోసం ఎదురు చూడలేదన్నారు. 2014లో రాజమండ్రి టికెట్ ఇస్తానని చంద్రబాబు చెప్పినా, మంత్రి పదవి ఇస్తానన్నా వద్దన్నానని చెప్పుకొచ్చారు. 2024 తర్వాత రాజకీయాల్లో ఉండనంటూ ప్రకటన చేసి ఆశ్చర్యపరిచారు. గత 42 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, స్వచ్ఛమైన రాజకీయాలు చేశానని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.
అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌పై విమర్శలు చేయడం సరికాదని సోము వీర్రాజు అన్నారు. పొరపాట్లు సరిదిద్దుకోవాలి గానీ.. విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు షెకావత్‌కు తెలియదన్న భ్రమలో ప్రభుత్వం ఉన్నదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని డెయిరీలు, చక్కెర మిల్లులను మూసేసిన వైకాపా ప్రభుత్వాన్ని ఏమనాలని ప్రశ్నించారు. పాయకరావుపేట చక్కెర కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే విక్రయానికి సిద్ధం చేసిందని గుర్తుచేశారు. అలాంటి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మూసేస్తున్నారని కేంద్రంపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. పీఆర్సీ కోసం ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు భాజపా మద్దతు ఉంటుందని సోము వీర్రాజు అన్నారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..