
(TATA motors) విజయవాడ : బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ అయిన టాటా మోటార్స్ ఫైనాన్స్ స్వచ్ఛ్ భారత్ మిషన్ను విజయవంతం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నట్లు వెల్లడించింది. వేస్ట్ మేనేజ్మెంట్ రంగంలో అవకాశాలను చేజిక్కించుకోవాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇస్తున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది. ఇందులో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్లో 792 టాటా ఏస్ వాహనాలను రూ. 36.62 కోట్లకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నది.
రీజనల్ బిజినెస్ హెడ్ టీ ప్రభు తెలిపిన వివరాల ప్రకారం.. టాటా ఏస్ వాహనాల కొనుగోలు నిమిత్తం టాటా మోటర్స్ ఫైనాన్స్ రూ.36.62 కోట్ల రుణాలు అందించింది. స్వచ్ఛ్ భారత్ మిషన్ 2.0 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కింద ఈ వాహనాలను వ్యర్థాల నిర్వహణకు వినియోగించనున్నారు. పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులు అందగా, వాటిన వడబోసిన అనంతరం రుణ ప్రక్రియను వేగవంతం చేశారు.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..