కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఆగస్టు 13: దేశంలోని పెట్రోలియం, డీజిల్, సహజ వాయువు (వంట గ్యాస్) డీలర్లు ఎదురొంటున్న సమస్యలను వెంటనే పరిషరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన పార్లమెంట్ భవనం ఆవరణలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖల మంత్రి హర్దీప్సింగ్ పూరీని కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు. డీలర్లు ఎదురొంటున్న పలు సమస్యల గురించి వివరించారు. వివిధ రాష్ర్టాలకు చెందిన డీలర్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డీలర్ల మార్జిన్ (కమీషన్) పెంచాల్సిందిగా తనతోపాటు స్థాయీ సంఘం చైర్మన్ సునీల్ దత్తాత్రే తరరేను ఇటీవల కలిసి కోరడాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.