న్యూఢిల్లీ, ఆగస్టు 13 : ఉబర్ దేశవ్యాప్తంగా మరో 100 నగరాలకు తన సేవలను విస్తరించింది. దీంట్లోభాగంగా తెలంగాణలోని 12 నగరాల్లో బైకు బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా తన సేవలను 225 నగరాలకు విస్తరించినట్టు అయిందని పేర్కొంది.
లాస్ట్-మైల్ కనెక్టివిటీ సేవలు అందించాలనే ఉద్దేశంతో తొలిసారి బుకింగ్ చేసుకునే వారికి ఉచితంగా రైడింగ్ అందిస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రత్యేక ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉండనున్నది.