Husband and Wife died : అనారోగ్యంతో భర్త మృతి.. తట్టుకోలేక భార్య కన్నుమూత
Husband and Wife died : అనారోగ్యానికి గురైన భర్త చికిత్స పొందుతూ మరణించగా.. భర్త ఎడబాటు తట్టుకోలేని భార్య గుండెపోటుకు గురై కన్నుమూసింది. ఈ హృదయవిదారక సంఘటన కృష్ణా జిల్లా కోరుకొల్లులో...

(Husband and Wife died) కృష్ణా : అనారోగ్యానికి గురైన భర్త చికిత్స పొందుతూ మరణించగా.. భర్త ఎడబాటు తట్టుకోలేని భార్య గుండెపోటుకు గురై కన్నుమూసింది. ఈ హృదయవిదారక సంఘటన కృష్ణా జిల్లా కోరుకొల్లులో జరిగింది. ఒకేరోజు దంపతుల చనిపోవడంతో కోరుకొల్లులో విషాదఛాయలు అలుముకున్నాయి.
గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన యోహాను అనే యువకుడు స్థానికంగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా.. ఆయన భార్య ఆనంద కుమారి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. వీరికి ఒక కుమార్తె. గత కొంత కాలంగా యోహాను అస్వస్థతతో ఉన్నారు. కొన్నిరోజులపాటు స్వగ్రామంలో గడిపేందుకని వారు కృష్ణా జిల్లా కోరుకొల్లుకు ఇటీవల వచ్చారు. అయితే, ఆదివారం ఉదయం యోహాను ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచాడు. భర్త మరణంతో ఆనందకుమారి కన్నీరుమున్నీరైంది.
సాయంత్రం యోహాను మృతదేహాన్ని ఖననం చేసేందుకు బంధువులు సమాయత్తమవుతుండగా.. ఆనందకుమారి గుండెపోటుకు గురైంది. దాంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. గంటల వ్యవధిలో దంపతులు మృతిచెందడంతో కోరుకొల్లులో విషాదం అలుముకున్నది. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయిన వాస్తవాన్ని జీర్ణించుకోలేని వారి కుమార్తె గుండెలవిసేలా రోధిస్తున్నది. మరణంలోనూ భర్త నీడను వీడకుండా ఆనందకుమారి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

