MLC’s oath : ప్రమాణం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు
MLC's oath : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 11 మంది ఎమ్మెల్సీల చేత...

(MLC’s oath) విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 11 మంది ఎమ్మెల్సీల చేత శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు ప్రమాణం చేయించారు. ఇటీవల స్థానిక సంస్థల కోటా కింద 11 మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా వైసీపీకి చెందిన వారే. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, సురేష్ తదితరులు హాజరయ్యారు.
విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖ నుంచి వరుదు కల్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంత సత్య ఉదయభాస్కర్, కృష్ణా జిల్లా నుంచి మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్,, గుంటూరు జిల్లా నుంచి డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హన్మంతరావు, ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు, చిత్తూరు జిల్లా నుంచి భరత్, అనంతపురం నుంచి యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి లు ప్రమాణస్వీకారం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు సరిపడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉండడంతో 11 మంది ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాదాపు 95 శాతం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. తాజాగా ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేయడంతో శాసనమండలిలో వైసీపీ బలం పెరిగింది. ఇకపై ఎలాంటి అడ్డంకులు లేకుండా బిల్లులు పాస్ చేయవచ్చునని వైసీపీ నేతలు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందా? ఈ వేరియంట్ లక్షణాలేంటి?
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

