శుక్రవారం 05 మార్చి 2021
Wanaparthy - Jan 19, 2021 , 02:06:29

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఐదు మెడల్స్‌

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఐదు మెడల్స్‌

వనపర్తి పాతబస్టాండ్‌, జనవరి 18 : సూర్యాపేటలో నిర్వహించిన ఏడో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ చాం పియన్‌షిప్‌ పోటీల్లో వనపర్తి జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు ఐదు మెడల్స్‌ సాధించినట్లు అథ్లెటిక్స్‌ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మయ్య, నరసింహ తెలిపారు. అండర్‌-18 విభాగంలో డిస్కస్‌త్రోలో ఆర్‌.సుజాత గోల్డ్‌మెడల్‌, షా ట్‌పుట్‌లో సిల్వర్‌ మెడల్‌, మూడు వేల మీటర్ల పరుగుపందెంలో కృష్ణ గోల్డ్‌మెడల్‌, అండర్‌-20 లో ఐదు వేల మీటర్ల పరుగుపందెంలో సంతోష్‌ బ్రాంజ్‌ మెడల్‌, అండర్‌-14లో గోవర్ధన్‌ 600 మీ టర్ల పరుగుపందెలో బ్రాంజ్‌ మెడల్‌ సాధించినట్లు పేర్కొన్నారు. మెడల్స్‌ సాధించిన విద్యార్థులను అసోసియేషన్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీకాం త్‌, షంషద్‌అలీ అభినందించారు. 

VIDEOS

logo