e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News థియేట‌ర్ల‌లోనే అక్ష‌య్ బెల్‌బాట‌మ్‌.. రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న‌

థియేట‌ర్ల‌లోనే అక్ష‌య్ బెల్‌బాట‌మ్‌.. రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న‌

థియేట‌ర్ల‌లోనే అక్ష‌య్ బెల్‌బాట‌మ్‌.. రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న‌

థియేట‌ర్ల‌కు, సినిమా ల‌వ‌ర్స్‌కు గుడ్‌న్యూస్‌. చాలా రోజుల త‌ర్వాత ఓ పెద్ద సినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అక్ష‌య్‌కుమార్ న‌టించిన బెల్‌బాట‌మ్ మూవీని జులై 27న రిలీజ్ చేస్తున్న‌ట్లే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ ఏడాది ఈ మూవీ త‌ప్ప ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ పెద్ద సినిమా రిలీజ్‌ను ప్ర‌క‌టించ‌లేదు. మొద‌ట్లో బెల్‌బాట‌మ్ కూడా నేరుగా డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేయాల‌ని భావించారు. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల్లో క‌రోనా ఆంక్ష‌ల‌ను మెల్ల‌గా తొల‌గిస్తున్నా.. థియేట‌ర్లు మాత్రం తెరుచుకోలేదు. అయితే త్వ‌ర‌లోనే అవి తెరుచుకుంటాయ‌ని భావిస్తున్నారు. హిందీ సినిమాల‌కు 60 శాతం రెవెన్యూ అందించే ఢిల్లీ, ముంబై న‌గ‌రాల్లోనూ థియేటర్లు ఇంకా మూసే ఉన్నాయి.

ఇలాంటి ప‌రిస్థితుల్లో బెల్‌బాట‌మ్ టీమ్ రిలీజ్‌ను ప్ర‌క‌టించ‌డం విశేషం. బెల్‌బాట‌మ్ కాకుండా సూర్య‌వంశి, 83, అత్రంగీ రే, పృథ్విరాజ్‌, జెర్సీ, లాల్‌సింగ్ చ‌ద్దా, స‌త్య‌మేవ జ‌య‌తే, గంగూబాయ్ క‌థియావాడి, ప‌ఠాన్‌లాంటి పెద్ద మూవీలు కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అటు అమెరికాలో ఇప్పుడు మార్కెట్ల‌న్నీ తెరుచుకోవ‌డంతో ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ 9, క్వైట్ ప్లేస్ 2, కంజూరింగ్ 3లాంటి హాలీవుడ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇవి త్వ‌ర‌లోనే ఇండియాకు కూడా రానున్నాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
థియేట‌ర్ల‌లోనే అక్ష‌య్ బెల్‌బాట‌మ్‌.. రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న‌
థియేట‌ర్ల‌లోనే అక్ష‌య్ బెల్‌బాట‌మ్‌.. రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న‌
థియేట‌ర్ల‌లోనే అక్ష‌య్ బెల్‌బాట‌మ్‌.. రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న‌

ట్రెండింగ్‌

Advertisement