మహా విపత్తు… ముంచుకొస్తున్న నీటి ముప్పు
గ్రేటర్‌లోని పశ్చిమ ప్రాంతంలో సాధారణంగానే నీటి ఎద్దడి ఉంటుంది. వర్షాకాలంలోనూ వెస్ట్‌లో కొంతమేర నీటి కొరత సర్వసాధారణం. కానీ ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఈ ఏడాది వర్షాలు సగానికి తగ్గాయి. దానికి తోడు ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతి రోజు 35 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ కలగలిపి ఆ ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చుతున్నది.
- వెస్ట్ సిటీ ప్రాంతాల్లోనే 3 వేలు దాటుతున్న ట్యాంకర్ల బుకింగ్స్
- ఐటీ, కమర్షియల్ ప్రాంతాల్లోనూ నీటి కటకట
- ఎండిపోతున్న బోర్లు, అడుగంటుతున్న సింగూరు జలమట్టం
- రాబోయే రోజుల్లో అత్యంత తీవ్రం కానునున్న నీటి కొరత
నగరంలో నీటి కొరత రోజురోజుకు తీవ్రమవుతున్నది. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా బోర్లన్నీ ఎండిపోతున్నాయి. ఈక్రమంలో జలమండలి సరఫరా చేస్తున్న నీళ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. తప్పని పరిస్థితుల్లో ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ట్యాంకర్ల డిమాండ్ వేసవిని తలపిస్తున్నది. గ్రేటర్ వ్యాప్తంగా రోజుకు 7 వేలకు పైగా ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. ఈనేపథ్యంలో వెస్ట్ సిటీకి ప్రమాద ఘంటికలు ముంచుకొస్తున్నాయి.
-సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ)
గ్రేటర్‌లోని పశ్చిమ ప్రాంతంలో సాధారణంగానే నీటి ఎద్దడి ఉంటుంది. వర్షాకాలంలోనూ వెస్ట్‌లో కొంతమేర నీటి కొరత సర్వసాధారణం. కానీ ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఈ ఏడాది వర్షాలు సగానికి తగ్గాయి. దానికి తోడు ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతి రోజు 35 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ కలగలిపి ఆ ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చుతున్నది. నివాసిత కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, బస్తీలు, ఐటీ పార్కులు, కమర్షియల్ కాంప్లెక్సులతో సహా అన్ని ప్రాంతాల్లో నీటి కొరత తాండవిస్తున్నది. వెస్ట్ సిటీలో సామాన్య జన జీవనంతో పాటు ఐటీ కారిడార్లు, కమర్షియల్ వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.
ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, సైబర్ సిటీ, నాలేడ్జ్ సిటీ, వివిధ ఐటీ పార్కులు, కమర్షియల్ కాంప్లెక్సులు ఇక్కడే ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈప్రాంతాల్లో నీటి కొరత మరింత తీవ్రం కానున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ నీటి అవసరం ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా ఉంటుంది. దీంతో సాధారణంగా నీటి కొరత ఉంటుంది. మరోవైపు ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే అట్టడుగున ఉన్నాయి. వీటన్నింటికీ ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులు, పెరిగిన ఉష్ణోగ్రతలు తోడయ్యాయి. ఇక నీటి ఎద్దడి పరిస్థితులు తీవ్రతరమయ్యాయి.
వెస్ట్ సిటీ మొత్తానికి జలమండలి సింగూరు జలాలనే సరఫరా చేస్తున్నది. సింగూరులో మరికొద్ది రోజుల్లో నీటి మట్టం వేగంగా పడిపోతున్నది. ఈ ఏడాది ఎగువన వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో వచ్చి చేరలేదు. దీనికి తోడు కొద్దిరోజుల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగటంతో ఇంకో పదిహేను ఇరవై రోజుల్లో డెడ్ స్టోరేజీకి చేరుకోనున్నాయి. సింగూరు వెస్ట్ సిటీపై తీవ్రమైన ప్రభావం చూపనున్నది. మరికొద్ది రోజుల్లో వెస్ట్ సిటీలో తీవ్ర ప్రభావం చూపనున్నది.
హాస్టళ్లు, గేటెడ్ కమ్యూనిటీపై ప్రభావం
పీజీ హాస్టళ్లు, గేటెడ్ కమ్యూనిటీలు, హౌసింగ్ సొసైటీలన్నీ దాదాపుగా వెస్ట్ సిటీలోనే ఉన్నాయి. కమ్యూనిటీలు, హౌసింగ్ సొసైటీలకు జలమండలి బల్క్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి జలమండలి సరఫరా చేసే నీళ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. నీటి ఎద్దడి నేపథ్యంలో ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా 7 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. అందులో 3 వేల ట్యాంకర్లు కేవలం వెస్ట్ సిటీలోనే బుక్ అవుతున్నాయి. ఐటీ కంపెనీల ఉద్యోగులంతా ఇక్కడి హాస్టళ్లలోనే ఉండటంతో నీటి అవసరాలు రెట్టింపు అవుతున్నాయి. దీంతో సరఫరా అయ్యే నీళ్లు సరిపోకపోవడంతో ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే డిసెంబర్ నుంచి పరిస్థితి అదుపు తప్పే ప్రమాదముంది. జలమండలి అధికారులు ముందుగానే అప్రమత్తమై వెస్ట్ సిటీకి నీటి సరఫరాపై ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని వినియోగదారులు కోరుతున్నారు. సింగూరుకు ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల నుంచి నీటి తరలించి రాబోయే విపత్తును అదపులోకి తీసుకురావాలని సూచిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

