నిధులివ్వండి మహాప్రభో.. ఇరు రాష్ర్టాలకూ కేఆర్ఎంబీ వేడుకోలు
‘బోర్డు నిర్వహణకు నిధులివ్వండి మహాప్రభో..’ అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) మొరపెట్టుకుంటున్నది. ప్రస్తుతం వచ్చే నెల జీతాలకు సైతం నిధుల్లేవని మొత్తుకుంటున్నది. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’ ప్రకారం కేఆర్ఎంబీ నిర్వహణకు అవసరయ్యే బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 50ః50 నిష్పత్తిలో భరించాల్సి ఉన్నది.
- ఈ ఏడాది బడ్జెట్ రూ.23 కోట్లు
- ఇప్పటికీ రూపాయి ఇవ్వని ఏపీ, తెలంగాణ
- టోకెన్లతోనే సరిపెడుతున్న ప్రభుత్వాలు
- వచ్చే నెల జీతాలకూ పైసల్లేవ్
- టెలిమెట్రీల నిధులూ హాంఫట్
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : ‘బోర్డు నిర్వహణకు నిధులివ్వండి మహాప్రభో..’ అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) మొరపెట్టుకుంటున్నది. ప్రస్తుతం వచ్చే నెల జీతాలకు సైతం నిధుల్లేవని మొత్తుకుంటున్నది. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’ ప్రకారం కేఆర్ఎంబీ నిర్వహణకు అవసరయ్యే బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 50ః50 నిష్పత్తిలో భరించాల్సి ఉన్నది. బోర్డు సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టి ఆ మేరకు ఆమోదం తీసుకోవడం పరిపాటి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.23 కోట్లు అవసరమని బోర్డు అంచనా వేసింది. ఈ మేరకు గత జనవరిలో నిర్వహించిన 20వ బోర్డు సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందుకు ఇరు రాష్ర్టాలు ఆమోదం తెలిపాయి. తెలంగాణ, ఆంధ్రపద్రేశ్ రాష్ర్టాలు చెరో రూ.11.5 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయాల్సి ఉన్నది. అయితే, ఇరు రాష్ర్టాలు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కేవలం టోకెన్లను రేజ్ చేస్తూ చేతులు దులుపుకొంటున్నాయే తప్ప పైసా విదల్చడం లేదని బోర్డు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం బోర్డు వద్ద రూ.3 లక్షలకు మించి నిధులు లేవని, నవంబర్ జీతాలను చెల్లించేందుకు సైతం నిధులు లేవని బోర్డు వర్గాలు వెల్లడించాయి. విషయాన్ని రెండు రాష్ర్టాలకు విన్నించినా పట్టించుకోవడం లేదని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల బోర్డు నిధుల పరిస్థితిపై ఏకంగా కేంద్ర జల్‌శక్తి శాఖకు సైతం బోర్డు ఫిర్యాదు చేసిందని సమాచారం.
టెలిమెట్రీల నిధులు హాంఫట్
కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదలకు సంబంధించిన లెక్కలను పక్కాగా సేకరించేందుకు గతంలోనే టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంగీకారానికి వచ్చాయి. మొదటి విడతలో నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 18 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేశారు. ఫేజ్-2 కింద మరో తొమ్మిది చోట్ల ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. ఫేజ్-2 కింద శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ దిగువన 3 కిలోమీటర్ల వద్ద), కేసీ కెనాల్, నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాలువ, కుడి ప్రధాన కాలువ, ప్రకాశం బరాజ్ తూర్పు ప్రధాన కాలువ, పశ్చిమ ప్రధాన కాలువ, పోలవరం కుడి కాలువ సంగమం, పాలేరు అప్‌స్ట్రీమ్, నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోని 21వ ప్రధాన బ్రాంచ్ కెనాల్ మొత్తంగా 9 ముఖ్యమైన ప్రదేశాల్లో సైడ్ లుకింగ్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్లతో (ఎస్ఎల్డీసీపీ) టెలిమెట్రీ స్టేషన్లను ఇన్స్టాల్ చేయాల్సి ఉన్నది. అందుకు రూ.7.18 కోట్లు అవసరమవుతాయని బోర్డు అంచనా వేసింది. ఆ నిధులను ఇరు రాష్ర్టాలు సమంగా భరించాల్సి ఉన్నది. తెలంగాణ సర్కార్ రూ.4.18 కోట్లను టెలిమెట్రీల ఏర్పాటు కోసం బోర్డుకు విడుదల చేసింది. ఏపీ సర్కార్ మాత్రం విడుదల చేయలేదు. నిధులు లేకపోవడంతో టెలిమెట్రీల నిధులనే బోర్డు నిర్వహణకు వినియోగించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఆ నిధులు సైతం పూర్తిగా ఖర్చయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

