చిన్నగోప్లాపూర్లో మూడు పంపులు ఆన్
కొడంగల్ నియోజకవర్గానికి సాగునీటిని తరలించాలనే లక్ష్యంతో చేపట్టిన కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భీమా ఫేజ్-1 పంప్‌హౌస్ స్టేజ్-1 నుంచి మూడు మోటర్లను నడిపితే నీటి విడుదల ఎలా ఉంటుందన్న విషయమై రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి పరిశీలించారు.
- కొడంగల్ లిఫ్ట్‌నకు ట్రయల్న్
- పరిశీలించిననీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి
- కాలువ సామర్థ్యాన్ని పెంచాలి : మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
మక్తల్, అక్టోబర్ 15 : భీమా ఫేజ్-1లో అంతర్భాగమైన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చిన్న గోప్లాపూర్ స్టేజ్-1 పంప్‌హౌస్‌లో మూడు మోటర్లను నీటిపారుదల శాఖ అధికారులు గురువారం ఆన్ చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి సాగునీటిని తరలించాలనే లక్ష్యంతో చేపట్టిన కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భీమా ఫేజ్-1 పంప్‌హౌస్ స్టేజ్-1 నుంచి మూడు మోటర్లను నడిపితే నీటి విడుదల ఎలా ఉంటుందన్న విషయమై రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి పరిశీలించారు. మూడు మోటర్ల ద్వారా 2,050 క్యూసెకుల నీరు స్టేజ్-1 నుంచి పంపింగ్ అవుతున్న నీరు.. గ్రావిటీ మీదుగా భూత్పూర్ రిజర్వాయర్‌కు చేరే వరకు కాలువను పరిశీలించారు. కొడంగల్ లిఫ్ట్‌నకు 7 టీఎంసీల నీటిని తరలించేందుకు చేపట్టే చర్యలో భాగంగా.. మూడు మోటర్లు ఒకేసారి ప్రారంభిస్తే గ్రావిటీ ద్వారా నీరు వెళ్తుందా? కాలువ సామర్థ్యం ఎంత? అని దాదాపు 3 గంటలపాటు పరిశీలించారు. అనంతరం పంపింగ్‌ను నిలిపివేశారు.
భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్ లిఫ్ట్‌నకు నీటిని తీసుకువెళ్లేందుకు చేపట్టిన ప్రాజెక్టుకు, భీమా ప్రాజెక్టులోని స్టేజ్-1 చిన్న గోప్లాపూర్ పంప్‌హౌస్ నుంచి నీటిని తరలించే గ్రావిటీ కెనాల్ సామర్థ్యాన్ని పెంచాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సూచించారు. అప్పుడే పంప్‌హౌస్ నుంచి భూత్పూర్ రిజర్వాయర్‌కు నీళ్లు చేరుతాయని రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. గురువారం సాయంత్రం చిన్న గోప్లాపూర్ వద్ద మోటర్లు ఆన్ చేస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకొన్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం అక్కడికి చేరుకొని పెంటారెడ్డితో చర్చించారు. ఈ ప్రాంతం నుంచి కొడంగల్ ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు చేపడుతున్న చర్యలో భాగంగా, మక్తల్ నియోజకవర్గానికి సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. మక్తల్ నియోజకవర్గాన్ని ఎండబెట్టి, కొడంగల్‌కు నీటిని తరలించే ప్రక్రియను చేపట్టే పనులను ఈ ప్రాంత రైతులు సహించబోరని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

