26న కృష్ణా బోర్డు మీటింగ్.. ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖ
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 21వ బోర్డు సమావేశాన్ని ఈ నెల 26వ తేదీన నిర్వహిస్తారు. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ చైర్మన్ గురువారం సమాచారం అందించారు. సమావేశంలో నీటి వాటాలపై ప్రధానంగా చర్చిస్తారు.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 21వ బోర్డు సమావేశాన్ని ఈ నెల 26వ తేదీన నిర్వహిస్తారు. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ చైర్మన్ గురువారం సమాచారం అందించారు. సమావేశంలో నీటి వాటాలపై ప్రధానంగా చర్చిస్తారు. ప్రతి నీటి సంవత్సరం అంటే జూన్ 1 నుంచి మే 31వ తేదీ వరకు ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగాలకు ఇరు రాష్ర్టాలు ఒప్పందాలు చేసుకోవాలి. అందుకు పూర్తిస్థాయి బోర్డు సమావేశం నిర్వహించాలి. కానీ, ఎల్ నినో పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ ఈ సీజన్లో అందుకు భిన్నంగా బోర్డు వ్యవహరించింది.
పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా, కేవలం నీటి వినియోగాలకు సంబంధించిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలుత ఆగస్టు 24వ తేదీన, తదుపరి ఈ నెల 4వ తేదీన రెండు దఫాలుగా త్రిసభ కమిటీ సమావేశం జరిగింది. నీటి వినియోగాలపై ఇరురాష్ర్టాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. తొలుత అక్టోబర్ 1న సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అది వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా 26వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. జలసౌధలో ఉదయం 11 గంటలకు చైర్మన్ నేతృత్వంలో జరిగే సమావేశానికి బోర్డు సభ్యులు, ఇరు రాష్ర్టాల సెక్రటరీలు హాజరవుతారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

