వరద నీళ్లన్నీ అయిపోయాక కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) అక్టోబర్ 1న సమావేశం కానున్నది. జలసౌధలో జరిగే ఈ భేటీలో ప్రస్తావించాల్సిన ఎజెండా అంశాలను తెలంగాణ అధికారులు సిద్ధం చేశారు.
ఈ ఏడాది నీటివాటాను ఖరారు చేయకుండానే నేరుగా నీటి వినియోగాలపైనే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) దృష్టి పెట్టింది. అదేమంటే ప్రాజెక్టులకు సరిపడా నీళ్లు రాలేదని బుకాయిస్తున్నది. వాటాల ఖరారు �