ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!

గత కొన్ని నెలలుగా దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఓ సినిమా గురించి ఎదురు చూస్తుంది. ఆ సినిమా మరేదో కాదు బాహుబలితో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా వలన వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీని ఎలా అయిన ఈ ఏడాది విడుదల చేయనున్నారు. సినిమా షూటింగ్‌కి సంబంధించి చివరి షెడ్యూల్ మిగిలి ఉండగా, ఆ షెడ్యూల్ లో కీలకమైన రెండు పాటలతో పాటు ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు.
దాదాపుగా 8 నుండి 10 వారాల పాటు కంటిన్యూ షెడ్యూల్ తో సినిమాను ముగించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని షూటింగ్స్ మొదలు కాగా, ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ కూడా మరి కొద్ది రోజులలో సెట్స్ పైకి వెళ్లనుంది. కొద్ది మంది క్రౌడ్ తో షూటింగ్ ప్రారంభించాలని జక్కన్న నిర్ణయానికి వచ్చాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా మొదలు పెట్టాడట. జులై మొదటి వారంలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారని యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ సినిమాలోని ఒక ఫైట్ కంటతడి పెట్టిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఇవి కూడా చదవండి..
Oxygen Levels : ఇవి తినండి.. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోండి
పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?
ఢిల్లీలో రెండు హాస్పిటళ్లలో ‘స్పుత్నిక్-వీ’ పంపిణీ
త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా
రేపు తెరుచుకోనున్న చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలు
Delta effect : బ్రిటన్‌లో జూలై 19 వరకు ఆంక్షల పొడగింపు
నేడు కర్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న కేటీఆర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- Rajamouli
- ram charan
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

