ఢిల్లీలో రెండు హాస్పిటళ్లలో ‘స్పుత్నిక్-వీ’ పంపిణీ
ఢిల్లీలో రెండు హాస్పిటళ్లలో ‘స్పుత్నిక్-వీ’ పంపిణీ |

దేశ రాజధాని ఢిల్లీలోని రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో వాచ్చే వారం నుంచి రష్యాకు చెందిన కరోనా టీకా స్పుత్నిక్-వీ టీకాలు వేయనున్నారు. మధుకర్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పటల్లో ఈ నెల 20 నుంచి టీకా వేయడం ప్రారంభించనున్నారు. అపాయింట్మెంట్ స్లాట్లను కొవిన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో టీకాలు వేసేందుకు అనుమతి ఇచ్చారు. ఆసుపత్రిలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఉద్యోగులకు టీకాలు ఆదివారం వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపారు.
స్పుత్నిక్ వీ వెయ్యి టీకాలు అపోలో ఆసుపత్రికి చేరుకోగా.. ఇందులో 170 మోతాదులు ల్యాబ్ ఉద్యోగులకు అందించినట్లు అధికారులు చెప్పారు. దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ తర్వాత స్పుత్నిక్-వీ దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన టీకా. ప్రస్తుతం టీకాను ప్రైవేటు ఆసుపత్రుల్లో వేస్తుండగా.. కేంద్రం మోతాదుకు ధర రూ.1,145గా నిర్ణయించింది. రష్యాకు చెందిన వ్యాక్సిన్ను దేశంలో ఉత్పత్తి, మార్కెటింగ్కు ఆర్డీఐఎఫ్తో హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Oxygen Levels : ఇవి తినండి.. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోండి
పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

