e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?

పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?

పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?

మనలో పెరుగంటే ఇష్టం లేనిది ఎవరికి? భోజనం ముగించే ముందు పెరుగన్నం కలుపుకుని తినడం తెలుగిళ్లల్లో సర్వ సాధారణం. కొందరు పెరుగును ఊరికే తింటుంటారు. లేదా లస్సీ రూపంలో, మజ్జిగ రూపంలో తీసుకుంటారు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మన జీర్ణశక్తిని మెరుగుపర్చి ఉష్ణాన్ని తగ్గిస్తాయి. అందుకే పెరుగు తింటే కడుపు చల్లగా ఉంటుంది అంటారు. అయినా పెరుగుతో కలిపి తినగూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి.

పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?

పెరుగు తిన్న వెంటనే నూనెలో దేవిన లేదా వెన్న, నెయ్యి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. దీనివల్ల జీర్ణక్రియ మందగించి బద్ధకం కలుగుతుంది.

పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?

పెరుగు, చేపలు కలిపి తినగూడదనేది పెద్దలు చెప్పిన మరో మంచిమాట. దీనికీ కారణం లేకపోలేదు. మాంసకృత్తులు అధికంగా ఉండే రెండు రకాల పదార్థాలు ఒకేసారి తినరాదని ఆయుర్వేదం చెప్తున్నది. ఈ రెండూ అధిక ప్రొటీన్లు కలిగినవే. కలిపి తింటే అజీర్ణంతోపాటు చర్మ సమస్యలు వస్తాయి.

పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?

ఇక పెరుగు, పాలు కలిపి తీసుకోరాదనేది మరోమాట. రెండింటిలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఒకటి పులిసింది, ఒకటి పులియనిది. అంతే తేడా. రెండూ ఏకకాలంలో తీసుకుంటే ఎసిడిటీ, గుండెమంట, విరేచనాలు, కడుపుబ్బరం వంటి వస్తాయి.

పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?

ఇక చివరగా మామిడి పండుతో పెరిుగు తీసుకోవడం. ఇది వినడానికి, తినడానికి బాగుంటుంది. కానీ పెరుగు తిన్న వెంటనే లేదా పెరుగుతోపాటే మామిడి తీసుకుంటే శరీరంలో విషపదార్థాలు పెరుగుతాయి. ఫలితంగా ఎలర్జీలు, చర్మ సమస్యలు రావచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

స‌హ‌జంగా బ‌రువు త‌గ్గేందుకు ఈ పండ్లు తినండి..!

ఈ ఆహార పదార్ధాలను కలిపి తినకూడదా..?

మామిడి పండ్లు తిన‌గానే ఆ ఐదింటి జోలికి అస‌లే పోవ‌ద్దు..!

పిల్లలకు ఎటువంటి ఆహరం పెట్టాలంటే..!

బీరకాయతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు…!

ఎన్ని నీళ్లు తాగాలి?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెరుగుతో తినగూడని పదార్థాలు ఏవి? ఎందుకు?

ట్రెండింగ్‌

Advertisement