సహజంగా బరువు తగ్గేందుకు ఈ పండ్లు తినండి..!
కొన్ని ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక బరువు తగ్గవచ్చునని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సీజన్ వారీగా లభించే పండ్లను తినడం వల్ల ఆరోగ్యం పొందడమే కాకుండా శరీరం బరువును కూడా నియంత్రించుకోవచ్చు.

న్యూట్రియంట్స్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కొన్ని రకాల పండ్లు, కూరగాయలను నిత్యం తీసుకోవడం వల్ల సహజంగా, వేగంగా శరీరం బరువు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక బరువు తగ్గవచ్చునని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సీజన్ వారీగా లభించే పండ్లను తినడం వల్ల ఆరోగ్యం పొందడమే కాకుండా శరీరం బరువును కూడా నియంత్రించుకోవచ్చు.
వాటర్ మెలన్..

వీటిలో అధికంగా నీటిశాతం కలిగి ఉంటుంది. అదనంగా, ఇది విటమిన్ ఎ, బి, సి మరియు అమైనో ఆమ్లాలు వంటి అనేక రకాల పోషకాలను కూడా కలిగి ఉంటుంది. ఈ పండ్లని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంతమంచిది. వీటిని తినగానే జీర్ణాశయం నిండిపోయినట్లు అనిపిస్తుంది. ఆకలి సమస్య ఉండదు. ఫలితంగా బరువు తగ్గుతాం. వీటిని తినడం వల్ల శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
మెలన్..

వీటిలో ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, కార్బోహైడ్రేట్ల వంటి మూలకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్ సీ చాలా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని కేలరీల పరిమాణం కూడా చాలా తక్కువ. 100 గ్రాముల మెలన్లో 34 కేలరీలు మాత్రమే ఉంటాయి. సహజంగా బరువు తగ్గాలనుకునే వారు వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల మంచి ఉపయోగం పొందవచ్చు.
ఆలుబుకారా..

ఈ పండ్లలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అదనంగా డైటరీ ఫైబర్స్, ఇస్టిన్, సార్బిటాల్ వంటి అంశాలు ఇందులో కనిపిస్తాయి. శరీరంలో ఈ మూలకాలను నింపడం ద్వారా అధిక రక్తపోటు సమస్య నయమవుతుంది. జీర్ణక్రియను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ పండు బరువును తగ్గించడంలో దోహదపడుతుంది.
మామిడి పండు..

మామిడి పండ్లలో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది. ఈ పోషకాలతో పాటు మామిడిలో విటమిన్ సీ, విటమిన్ ఏ, విటమిన్ డీ కూడా లభిస్తాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అలాగే, శరీరం బరువును నియంత్రించడంలో సహకరిస్తాయి.
లిచీ పండ్లు..

లిచీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేసుకోవచ్చు. బరువును నియంత్రించాలనుకునే వారు డైట్ ప్లాన్‌లో వీటిని చేర్చుకోవాలి. లిచీలో ప్రోటీన్, పిండి పదార్థాలు, చక్కెర, ఫైబర్, కొవ్వు ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి శరీరం బరువు పెరుగకుండా చూస్తుంది.
బెర్రీ ఫ్రూట్స్..

బ్లాక్ బెర్రీ, క్రాన్ బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీలు ఇలా ఏవైనా సరే.. శరీరం బరువుని తగ్గిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీరరోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా కొవ్వుని తగ్గించి బరువు తగ్గేందుకు ఈ ఫ్రూట్స్ ఎంతో బాగా పనిచేస్తాయి.
కివీ పండ్లు..

కివీ పండ్లలో పీచు అధికంగా ఉంటుంది. తక్కువ క్యాలరీలను ఇస్తాయి. విటమిన్ సీ ఈ పండ్లలో అధికంగా ఉంటుంది. రోజుకు ఒక కివీ పండును తింటే కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. వీటిని తినడం వలన కడుపు నిండిన భావనను కలగజేసి శరీరం బరువును తగ్గిస్తాయి.
ఇవి కూడా చదవండి..
క్వారంటైన్లో పాక్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు
అజ్మీర్‌లో పెద్ద ఎత్తున నిషేధిత మందులు పట్టివేత
కొవిడ్ అంటే అంటువ్యాధే కాదు.. ఓ సంస్థ పేరు కూడా..!
తొలిసారిగా చిన్ని గుండెను సృష్టించిన శాస్త్రవేత్తలు
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
డబ్ల్యూటీసీ పేలుడు కేసులో నలుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష.. చరిత్రలో ఈరోజు
స్మార్ట్ ఫోన్ యూజర్స్ కోసం ‘హైటెక్ థర్డ్ ఐ’ రెడీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

