e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News కొవిడ్ అంటే అంటువ్యాధే కాదు.. ఓ సంస్థ‌ పేరు కూడా..!

కొవిడ్ అంటే అంటువ్యాధే కాదు.. ఓ సంస్థ‌ పేరు కూడా..!

కొవిడ్ అంటే అంటువ్యాధే కాదు.. ఓ సంస్థ‌ పేరు కూడా..!

న్యూయార్క్ : కొవిడ్.. ఈ పేరు ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి నోళ్ల‌లో నానుతున్న ప‌దం. కొవిడ్ అంటే ప్ర‌తి ఒక్క‌రికి ప‌క్క‌లో భ‌యం క‌లుగుతున్న‌ది. అయితే, అచ్చం ఇదే పేరుతో అమెరికాలో ఓ సంస్థ కూడా ఉన్న‌ది. అదేంటి.. కొవిడ్ అనేది వైర‌స్ పేరు క‌దా! అని ఆశ్చ‌ర్య‌పోకండి. మీరు చ‌దివింది నిజంగా నిజం.

అరిజోనా ప్రావిన్స్‌లోని టెంపే నగరంలో దాదాపు 40 ఏండ్ల క్రితం నెల‌కొల్పిన సంస్థ పేరు కూడా కొవిడ్‌యే! ఈ కొవిడ్ సంస్థ గ‌త‌ నాలుగు దశాబ్దాలుగా ఆడియో విజువల్ వాల్ ప్లేట్లు, కేబుళ్ల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తుంది. 40 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ సంస్థ గత సంవత్సరం చ‌ర్చ‌లోకి వ‌చ్చింది. గ‌త ఏడాది నుంచి కొవిడ్ ప్ర‌పంచ‌దేశాల‌ను భ‌య‌పెట్ట‌డం ప్రారంభించిన త‌ర్వాత ఈ సంస్థ పేరును చూడ‌గానే కూడా భ‌య‌ప‌డుతున్నార‌ని కంపెనీ సీఈఓ నార్మ్ కార్సన్ చెప్తున్నారు. తొలుత కొవిడ్ బ‌య‌ట‌ప‌డిన స‌మ‌యంలో ఆమెస్ట‌ర్‌డామ్‌లో జ‌రిగిన విజువ‌ల్ షోలో పాల్గొనేందుకు వెళ్లాన‌ని, అక్క‌డంతా కొవిడ్‌, కొవిడ్ అంటే త‌న సంస్థ పేరును చెప్తున్నార‌ని సంబర‌ప‌డ్డా.. అయితే అది ఒక వైర‌స్ వ్యాధి అని తెలిసిన త‌ర్వాత చాలా ఆశ్య‌ర్చ‌మేసిందని నార్మ్ కార్స‌న్ తెలిపారు.

ఈ సంస్థ వ్యవస్థాపకుడు తొలుత‌ దీనికి వీడియో కంపెనీ లేదా వీడియో ఫర్ షార్ట్ అని పేరు పెట్టాలని అనుకున్నాడంట‌. కాని ఆ సమయంలో ఈ పేరుతో చాలా కంపెనీలు ఉండ‌టంతో ఒక కార్మికుడు చేసిన సూచ‌న‌తో కొవిడ్ అని పేరు పెట్టారంట‌. త‌మ సంస్థ పేరు త కంపెనీ పంపిణీదారులు, డీల‌ర్లు మాత్ర‌మే తెలుసున‌ని, అయితే, కరోనా పుణ్య‌మా అని ఇప్పుడు ప్ర‌పంచానికి తెలిసిపోయింద‌ని సంబుర‌ప‌డుతున్నారంట సంస్థ ఉద్యోగులు.

త‌మ కంపెనీ బోర్డును చూసిన ప‌లువురు ఇక్క‌డ కొవిడ్ ప‌రీక్ష‌లు జ‌రుపుతారా..? అని కొంత మంది ఆరాతీయ‌గా.. మ‌రికొంద‌రు ఇక్క‌డ కొవిడ్‌పై ప‌రిశోధ‌న‌లు చేస్తారా..? అని ప్ర‌శ్నించారంట‌. సంస్థ పేరు మార్చుకోవాల‌ని ప‌లువురు సూచ‌న‌లు కూడా చేశారంట‌. అయితే, పేరునుగానీ, ట్యాగ్‌ను గానీ మార్చేది లేద‌ని సంస్థ సీఈఓ నార్మ్ కార్స‌న్ అంటున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

తొలిసారిగా చిన్ని గుండెను సృష్టించిన శాస్త్ర‌వేత్త‌లు

రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంప‌తులు

డ‌బ్ల్యూటీసీ పేలుడు కేసులో న‌లుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

అమెరికాలో మ‌రో న‌ల్ల‌జాతీయుడి మ‌ర‌ణంపై వివాదం.. తాజాగా వీడియో బ‌య‌ట‌కు

స్మార్ట్ ఫోన్ యూజ‌ర్స్ కోసం ‘హైటెక్ థర్డ్ ఐ’ రెడీ

సెప్టెంబ‌ర్‌లో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొవిడ్ అంటే అంటువ్యాధే కాదు.. ఓ సంస్థ‌ పేరు కూడా..!

ట్రెండింగ్‌

Advertisement